Govt పాఠశాలల్లో చదివే Students కు పాలు

హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఇయ్యాల తెలంగాణ) : విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాలు అందించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే 1 నుంచి 12వ తరగతి విద్యార్థులు పాలు అందిస్తారు.పంపిణీ కోసం రాష్ట్ర పాడి పరిశ్రమ అభివద్ధి(విజయ డెయిరీ)కి మె?దటి విడతగా.. రూ.120 కోట్ల ఆర్డర్ ఇచ్చింది ప్రభుత్వం. వచ్చే విద్యా సంవత్సరం జూన్‌లో పాఠశాలలు తెరిచేనాటి నుంచి పాలు సరఫరా చేయాలని చెప్పింది. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వం పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాలు అందనున్నాయి. విద్యార్థులకు పాలు పంపిణీ చేయాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ బాధ్యతలు విజయ డెయిరీకి అప్పగించాలని ఆదేశాలు ఇచ్చారు.ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఉదయంపూట బ్రేక్ ఫాస్ట్‌తోపాటుగా పాలను అందజేయనున్నారు. విద్యార్థుల్లో రక్తహీనతను తగ్గించడం, వారికి పౌష్టికాహార లోపాన్ని నివారించాలని ప్రభుత్వం అనుకుంటోంది. అందులో భాగంగా ఈ పథకాన్ని తీసుకొస్తుంది. జూన్ నెలలో విద్యాసంస్థలు పున:ప్రారంభం అయ్యే సమయానికి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని విద్యాశాఖ అనుకుంటోంది.

రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు ఈ పథకం లబ్ధి చేకూరుస్తుంది.ఈ పథకం అమలులో భాగంగా పాల సరఫరా బాధ్యతను ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీకి అప్పగించారు. ఇందుకు రూ.120 కోట్ల విలువైన భారీ ఆర్డర్‌ను ప్రభుత్వం కేటాయించింది. పాలు త్వరగా పాడవకుండా ఉండేందుకు, పంపిణీ సులభతరం చేయడానికి 150`200 ఎంఎల్ టెట్రా ప్యాకెట్లను సిద్ధం చేయనున్నారు.జూన్ వరకు ఈ ప్యాకెట్లను స్కూళ్లకు చేర్చడానికి డెయిరీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనితో విద్యార్థులకు నాణ్యమైన పాలు అందుతాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది.విద్యార్థులకు అందించే ఆహారంలో వైవిధ్యాన్ని, పోషక విలువలను సమపాళ్లలో అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక మెనూను రూపొందించింది. ఇందులో భాగంగా.. వారానికి మూడు రోజులు పాలను, మిగిలిన మూడు రోజులపాటు రాగి జావను పంపిణీ చేస్తారు. రాగి జావలో కాల్షియం, ఐరన్ అధికంగా ఉండటం వలన విద్యార్థులకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. మధ్యాహ్నం భోజనం, ఉదయం పూట పౌష్టికాహారంతో విద్యార్థుల ఎదుగుదల బాగుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు పాఠశాలల్లో హాజరుశాతం పెరగుతుందని అధికారులు చెబుతున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....