Elections కు రెడీ అవుతున్న పార్టీలు

ఖమ్మం, జనవరి 22 (ఇయ్యాల తెలంగాణ) :   ఖమ్మం జిల్లాలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైనది ఒకవైపు ఎండలు వేడి ఎక్కువవుతుంది మరోవైపు రాజకీయ వేడి ఎక్కువవుతుంది ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఖమ్మం జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్ బిఆరఎస్ పార్టీలు ఏదులాపురం,వైరా, కల్లూరు మధిర,సత్తుపల్లి లో ఎన్నికలు ఇన్చార్జిలను నియమించుకున్నారు.మరోవైపు చాప కింద నీరు లాగా బలంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీలైన సిపిఐ సిపిఎం పార్టీలు కూడా సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్ ని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు వాళ్లకు బలంగా ఉన్నచోట పోటీ చేసి మిగతా చోట్ల ఎవరికి మద్దతు ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు మిగతా పార్టీలైన బిజెపి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ సైతం పోటీలో సిద్ధంగా ఉన్నాము అంటూ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు.సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో మంచి జోష్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే హవా కొన సాగించాలని, బిఆరఎస్ పార్టీ కూడా గత వైభవాన్ని దష్టిలో ఉంచుకొని బాగా పనిచేసే మంచి ఫలితాలను సాధించాలని వ్యూహరచనలు చేస్తున్నాయి.మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టిఆరఎస్ సీపీఐ సిపిఎం పార్టీలు మధ్య పోటీ ఉండగా, కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి, అదేవిధంగా బిఆరఎస్ సీపీఎం పార్టీలు కలిసి పోటీ చేసే ఆలోచనలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి అదే దిశగా పావులు కదుపుతున్నారు. ఖమ్మం జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో క్లీన్ స్వీప్ చేయాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు మంత్రులు సంకల్పంతో పనిచేస్తున్నారు.రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఉన్న ఏదులాపురం మున్సిపాలిటీలో ఇప్పటికే మంత్రి  పలుమార్లు పర్యటించి ఇన్చార్జిలని నియమించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

అలాగే ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరిధిలో ఉన్న మధిర మున్సిపాలిటీలో అన్ని వార్డులతో సహా ఇన్చార్జిలను నియమించి వారితో చర్చించి దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇకపోతే వైరా కల్లూరు సత్తుపల్లి మున్సిపాలిటీలలో మంచి పట్టు ఉన్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఎమ్మెల్యే రాగమయి సత్తుపల్లి కాంగ్రెస్ నాయకులు దయానంద్ తో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు చర్చించి వ్యూహాలను తయారు చేస్తున్నారు.మొత్తం విÖద ముగ్గురు మంత్రులు కలిసి ఖమ్మం జిల్లాలో అన్ని మున్సిపాలిటీలలో అన్ని వార్డులతో సహా కైవసం చేసుకోవాలని మంచి పట్టుదలతో పని చేస్తున్నారు. మరోపక్క బిఆరఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి అజయ్ కుమార్ వైరా పై దష్టి పెట్టి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. మధిరకు మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు,  లింగాల కమల్ రాజు విస్తతంగా పర్యటించి కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు.  ఎదులాపురం మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి,కల్లూరు సత్తుపల్లి కి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య లను ఇన్చార్జిలుగా నియమించి బిఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యవేక్షిస్తున్నారు. ఇలా ఖమ్మం జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో జెండాలు ఎగురవేసేందుకు ఎవరి వ్యూహాల్లో వారు రచిస్తున్నారు. ఖమ్మం అంటే తెలుగుదేశం కంచుకోట అని, కనుక తెలుగు తమ్ముళ్లు ఎవరికి  మద్దతిస్తే వాళ్లే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది అందరూ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని టిడిపి తమ్ముళ్లు పట్టు ఉన్నచోట పోటీ చేయాలని ఇప్పటికే పార్టీ పెద్దల దష్టికి తీసుకెళ్ళారు. ఇందుకు టీడీపీ నాయకులు దానికి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈసారి ఖమ్మం జిల్లాలో టిడిపి కూడా పోటీలో ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....