దేశ సేవకు పునరంకితం కావాలి : జిల్లా SP అశోక్‌ కుమార్‌

జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

జగిత్యాల, ఆగస్టు 15 (ఇయ్యాల తెలంగాణ) : దేశ సేవకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని జిల్లా ఎస్పీ  అశోక్‌ కుమార్‌ పిలుపు నిచ్చారు.శుక్రవారంజిల్లా పోలీస్‌ కార్యాలయంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ఎస్పీ స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలందరికీ, అధికారులకు, సిబ్బందికి ముందుగా 79 వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఒక్కరూ దేశసేవకు పునరంకితం కావాలన్నారు. స్వాతంత్ర పోరాటాన్ని గుర్తు చేసుకోవడం, భారతదేశానికి స్వేచ్ఛ కల్పించిన త్యాగధనులను స్మరించుకోడం మనందరి బాధ్యత అన్నారు. పోలీసు అధికారులు జాతి సమగ్రత, సమాజంలో శాంతి స్థాపనకు కృషి చేయాలన్నారు. ఎందరో మహానుభావులు త్యాగఫలమే ఈరోజు మనందరం స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవిస్తున్నామని తెలిపారు.

మహానుభావుల త్యాగాలను నిరంతరం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు.స్వాతంత్ర దినోత్సవ  సందర్భంగా పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ లో పోలీస్‌ శాఖ వారిచే ఏర్పాటు చేయబడిన స్టాల్‌, డాగ్‌ స్క్వాడ్‌ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ స్టాల్‌ లో  పోలీస్‌ వ్యవస్థ పనితీరు, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఉపయోగించే అధునాతన సాధనాలు, పోలీస్‌ శాఖ అవలంబిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, సైబర్‌ క్రైమ్‌, షీ టీమ్స్‌, ప్రింగర్‌ ప్రింట్‌, కమ్యూనికేషన్‌, బాబ్‌ డిస్పోసల్‌ టీమ్‌, ఆయుధాల గ్యాలరీ, డాగ్‌ స్క్వాడ్‌ , మొదలగు వాటి పై సవివరంగా తెలియజేసేందుకు ఏర్పాటుచేసిన స్టాల్స్‌ ల ప్రదర్శన అందరిని ఆకర్షించింది.ఈ కార్యక్రమంలో ఎస్భీ డీఎస్పీ వెంకటరమణ, సైబర్‌ క్రైమ్‌ డిఎస్పి వెంకట రమణ, మెట్పల్లి డిఎస్పి రాములు,బీసీఆర్భీ,ఎస్సీ,ఐటీ కోర్‌, ఫింగర్‌ ప్రింట్‌ ఇన్స్పెక్టర్‌ లు శ్రీనివాస్‌ ,ఆరిఫ్‌ అలీ ఖాన్‌, రఫిక్‌ ఖాన్‌ ,శ్రీధర్‌ రిజర్వు ఇన్స్పెక్టర్లు, కిరణ్‌ కుమార్‌ , వేణు, సైదులు,రిజర్వు సబ్‌ ఇన్స్పెక్టర్‌ లు,డీపీవో కార్యాలయ సిబ్బంది, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....