Delhi లిక్కర్‌ కేసు వ్యవహారం !

న్యూఢిల్లీ, జూలై 28, (ఇయ్యాల తెలంగాణ) : ఢిల్లీ లిక్కర్‌ కేసు వ్యవహారంలో భాగంగా గత మార్చి నెలలో ఎమ్మెల్సీ కవిత ఎన్ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ విచారణకు నోటీసులు ఇచ్చిన విషయంలో ఓ మహిళను ఈడీ కార్యాలయానికి పిలిపించవచ్చా అనే దానిపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించగా, తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఎమ్మెల్సీ కవిత పక్షాన నిలిచింది. ఈడీపై కవిత దాఖలు చేసిన పిటిషన్‌ ను సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.విచారణ కోసం మహిళను ఈడీ కార్యాలయానికి పిలిపించవచ్చా లేదా అన్న అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు  స్పష్టం చేసింది. మహిళను ఢిల్లీ లోని ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడానికి సవాల్‌ చేస్తూ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌ దాఖలు చేయగా.. పిటిషన్‌ ను జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌర్‌ ధర్మాసనం విచారణ చేసింది. కవిత పిటిషన్‌ ను పరిగణలోకి తీసుకుని.. ఆ పిటిషన్‌ పై ఆరు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఈడీని ఆదేశించింది. ఆ తర్వాత రెండు వారాల్లో రిజాయిండర్‌ దాఖలు చేయాలని కవితకు సూచించింది. కవిత తరఫున సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, ముకుల్‌ రోహద్గీ వాదనలు వినిపించారు. విచారణకు తెలంగాణ అదనపు అడ్వకేట్‌ జనరల్‌ జే రామచందర్‌ రావు కూడా హాజరు అయ్యారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....