Congress విజయభేరి సభకు జాతరలా తరలి రావాలి

హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 15 (ఇయ్యాల తెలంగాణ) :  చార్మినార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ కె.వెంకటేష్‌ తుక్కుగూడలో ఈనెల 17న కాంగ్రెస్‌ పార్టీ నిర్వహిస్తున్న విజయభేరి సభకు కాంగ్రెస్‌ శ్రేణులు జాతర లా తరలివచ్చి విజయవంతం చేయాలని చార్మినార్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ కె.వెంకటేష్‌ పిలుపునిచ్చారు.గురువారం చార్మినార్‌ సవిూపంలోని అలీజా కోట్ల వద్ద సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు మొహ్మద్‌ మూసా ఖాసీం అధ్యక్షతన ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి వెంకటేష్‌ ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ విజయభేరి సభకు పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ,ప్రియాంకా  గాంధీ, రాహుల్‌ గాంధీ,మల్లికార్జున్‌ ఖర్గే తదితర ప్రముఖులు వస్తున్నారని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించిన సోనియాగాంధీ హైదరాబాద్‌ వేదికగా నిర్వహించే బహిరంగ సభలో తెలంగాణాలో పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే డిక్లరేషన్లను సోనియాగాంధీ ఈ సభలో ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సోనియా చేసిన త్యాగాలేమిటో ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు.కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ సభకు కాంగ్రెస్‌ అభిమానులు,కార్యకర్తలు,నాయకులు పెద్దఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని వెంకటేష్‌ కోరారు.తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు.సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు మొహ్మద్‌ మూసా ఖాసీం,సయ్యద్‌ ముజాయిద్‌ షా,సయ్యద్‌ ఇక్బాల్‌,తిరుపతి చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....