| కాంగ్రేస్ భేటీ నేపధ్యంలో వెలిసిన పార్టీ వ్యతిరేక పోస్టర్లు |
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల నేపథ్యంలో శుక్రవారం రాత్రి వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కరప్ట్ వర్కింగ్ కమిటీ’’ అంటూ హైదరాబాద్ లో పోస్టర్లు వెలిసాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (అచిఅ) సభ్యుల ఫొటోలు, వారు చేసిన స్కాముల వివరాలతో పోస్టర్ కనిపించాయి. హోర్డింగ్ లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా మొత్తం 24 మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల ఫొటోలు, వారి స్కాముల వివరాలతో పోస్టర్ లు, బివేర్ ఆఫ్ స్కామర్స్ (స్కాములు చేసే వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి) అంటూ టాగ్ లైన్ తో పోస్టర్ లు వున్నాయి. ప్రజలు పోస్టర్ లను ఆసక్తిగా గమనిస్తున్నారు. యూపీఏ హయాంలో జరిగిన స్కాంల గురించి జనాలు మరోసారి చర్చించుకుంటున్నారు.
మల్లికార్జున ఖర్గే ? నేషనల్ హెరాల్డ్ స్కాం, సోనియా గాంధీ ? నేషనల్ హెరాల్డ్ స్కాం, ఛాపర్ స్కాం, మన్మోహన్ సింగ్ ? కోల్ అలోకేషన్ స్కాం, రాహుల్ గాంధీ ? నేషనల్ హెరాల్డ్ స్కాం, ఏకే ఆంటోనీ ? నేషనల్ హెరాల్డ్ స్కాం, విూరా కుమార్ ? నేషనల్ హైవేస్ అథారిటీ స్కాం, దిగ్విజయ్ సింగ్ ? రిక్రూట్ మెంట్ స్కాం, చిదంబరం ? ఫోర్జరీ, స్టాక్ మార్కెట్ , శారదా చిట్ ఫండ్, వీసా స్కాం, లాల్ థన్ వాలా ?మధ్యాహ్న భోజన స్కాం, లాటరీ స్కాం, ముఖుల్ వాస్నిక్ ? ఎలక్షన్ టికెట్ స్కాం, ప్రాపర్టీ టాక్స్ స్కాం, ఆనంద్ శర్మ ? వాల్ మార్ట్ స్కాం, అశోక్ రావ్ చవాన్ ? ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కాం, చరంజిత్ సింగ్ చన్నీ ? స్పోర్ట్స్ కిట్, ప్రభుత్వ ఉద్యోగాలు, థీమ్ పార్క్ స్కాం, ప్రియాంక గాంధీ వాద్రా ? నేషనల్ హెరాల్గ్ స్కాం, డీఎల్‌ఎఫ్ లాండ్ స్కాం, అభిషేక్ మనుసింఫ్వీు ? సీడీ రికార్డింగ్ స్కాం, జైరాం రమేష్ ? కోల్ స్కాం, మహేంద్రజీత్ సింగ్ మాల్వియా ?అసిస్టెంట్ ఇంజినీర్స్ ట్రాన్స్ ఫర్ స్కాం, కేసీ వేణుగోపాల్ ? సోలార్ స్కాం, అధిర్ రంజన్ చౌదరి ? శారదా స్కాం, అంబికా సోని ? రైల్వే వాటర్ బాటిల్స్ స్కాం, అజయ్ మాకెన్ ? రియల్ ఎస్టేట్ స్కాం, తామ్రద్వజ్ సాహు ? ఆవు పేడ స్కాం, సల్మాన్ ఖుర్షీద్ ? వీల్ చెయిర్ స్కాం, శశిథరూర్ ? స్పాట్ ఫిక్సింగ్ స్కాం లను పోస్టర్లలలో పేర్కోన్నారు.