ఖమ్మం అక్టోబర్ 27 (ఇయ్యాల తెలంగాణ ):ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు వెళ్తూ ట్రాక్టర్ బోల్తా పడి గాయపడిన ఘటనలో క్షత గాత్రులను ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. కూసుమంచి మండలం గైగొల్లపల్లి గ్రామానికి చెందిన టి ఆర్ యెస్ కార్యకర్తలు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభ కు జీళ్ళ చెరువు కు ట్రాక్టర్లో వెళ్తున్న క్రమంలో నన్ తండా వద్దకు రాగానే ఒక్కసారిగా ట్రాక్టర్ అదుపుతప్పి కింద పడిపోయింది. అందులో ఉన్న జనం ఒకరి విూద ఒకరు పడి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను హుటాహుటిన 108 ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. తెలు సావిత్రి, తురక పద్మ, కొక్కి రేణి కృష్ణ, తెలు అనసూయలకు గాయాలయ్యాయి. ,
- Homepage
- Telangana News
- CM సభకు వెళ్తూ..ట్రాక్టర్ బోల్తా ఒకరు మృతి..పలువురికి గాయాలు
CM సభకు వెళ్తూ..ట్రాక్టర్ బోల్తా ఒకరు మృతి..పలువురికి గాయాలు
Leave a Comment