CM రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్‌ బహిరంగ లేఖ

కరీంనగర్‌ జులై 08 (ఇయ్యాల తెలంగాణ );ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ బహిరంగ లేఖరాసారు. గురుకుల విద్యాలయాలకు రూపొందించిన కొత్త టైం టేబుల్‌ పనివేళలను కుదించాలని లేఖలో కోరారు. ఉదయం 5 నుండి రాత్రి 9.30 గంటల వరకు పనివేళలు రూపొందించడంవల్ల నిద్రలేమి, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని వెల్లడిరచారు. రాత్రిపూట స్టడీ అవర్‌, కేర్‌ టేకర్‌ విధులను కూడా టీచర్లకు అప్పగించడం సరికాదు, వార్డెన్ల పోస్టులు మంజూరైనా భర్తీ చేయకపోవడం బాధాకరం. తక్షణమే వార్డెన్‌ పోస్టులను భర్తీ చేయాలి. కరీంనగర్‌ జిల్లా పోలీసులకు నెలల తరబడి టీఏ, డీఏ, పీఆర్సీ, సరెండర్‌ లీవ్‌ బిల్స్‌ చెల్లించకపోవడం దారుణం. వివిధ విభాగాల్లోని దాదాపు వెయ్యి మంది పోలీసులు తీవ్ర ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడిరచారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బకాయిలను చెల్లించిన ప్రభుత్వం కరీంనగర్‌ జిల్లా పోలీసులను పట్టించుకోకపోవడం బాధాకరం, తక్షణమే టీఏ డీఏ పీఆర్సీ బకాయిలతోపాటు సరెండ్‌ లీవ్‌ బిల్స్‌ చెల్లించాలని లేఖలో పేర్కోన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....