CM రేవంత్‌ తో సిరాజ్‌ భేటీ !

హైదరాబాద్‌, జూలై 9, (ఇయ్యాల తెలంగాణ) :టీమిండియా పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ నేడు తెలంగాణ ముఖ్యమమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిశారు. టీ20 ప్రపంచ కప్‌ సాధించినందుకు సిరాజ్‌ను సీఎం అభినందించారు. ఆ తర్వాత సిరాజ్‌ టీమిండియా జెర్సీని సీఎం రేవంత్‌ రెడ్డికి బహుకరించాడు. కాగా, ఈ కార్యక్రమంలో రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రి కోమటి రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, టీమిండియా మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ కూడా పాల్గొన్నారు.ఇటీవల, టీమిండియా ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌ విజయం తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టిన భారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు హైదరాబాద్‌లో క్రికెట్‌ అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. బాణసంచా కాల్చడంతో దేశభక్తి గీతాలతో అభిమానులు 30 ఏళ్ల హైదరాబాద్‌ పేసర్‌కు స్వాగతం పలికారు.కాగా, భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) నుంచి రూ.125 కోట్ల బహుమతిలో వాటాను సిరాజ్‌ కూడా అందుకోనున్నారు. మహ్మద్‌ సిరాజ్‌ సహా 15 మంది ఆటగాళ్లలో ఒక్కొక్కరికి రూ.5 కోట్లు అందనున్నాయి. ఫైనల్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడిరచి టీ20 ప్రపంచకప్‌ను భారత్‌ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే ……  !

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....