Charminar భాగ్యలక్ష్మీ ఆలయంలో – బోనాల ప్రత్యేక పూజలు !

హైదరాబాద్, జూలై 28 (ఇయ్యాల తెలంగాణ) : భాగ్యనగరంలో బోనాల ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బోనాల ఉత్సవాల్లో భాగంగా చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర రోడ్లు , భవనాల శాఖా మంత్రివర్యులు కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించుకున్నారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులూ డాక్టర్ కె. లక్ష్మణ్  తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం నిర్వాహకురాలు శశికళ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగ కుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. 




iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....