CC Road నిర్మాణం కోసం గాంధీభవన్ ప్రజావాణి కార్యక్రమంలో వినతి

గాంధీ భవన్, జూన్‌ 21, (ఇయ్యాల తెలంగాణ) : మల్కాజ్ గిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మచ్చ బొల్లారం లో వార్డ్ నెంబర్ 133 గత 10 సంవత్సరాలుగా రోడ్డు వ్యవస్థ లేక తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని పి.పి. హైట్స్ ఫ్లాట్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో జరిగిన ప్రజావాణి లో దరఖాస్తు అందించడం జరిగింది. ఇందులో భాగంగా కాంగ్రేస్ పార్టీ నాయకులు ముండ్రాయి శ్రీనివాస్ ఫ్లాట్ యజమానుల సంక్షేమ సంఘం ఆర్గనైజర్ కార్యదర్శి బి శ్రీకాంత్ గౌడ్ వినతి పత్రాన్ని ప్రజావాణి కార్యక్రమంలో అందజేశారు. ఏళ్ల తరబడి ఈ ప్రాంతంలో రోడ్డు వ్యవస్థ సరైన విధంగా లేక స్థానిక బస్తీ వాసులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. శనివారం గాంధీ భవన్ లో జరిగిన ప్రజా ధర్బార్ కార్యక్రమం లో సిసి రోడ్డు నిర్మాణం చేపట్ట వలసిందిగా ఫ్లాట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కాంగ్రేస్ పార్టీ నాయకులు ముండ్రాయి శ్రీనివాస్ కోరారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....