హైదరాబాద్, సెప్టెంబర్ 12 (ఇయ్యాల తెలంగాణ) : ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల లక్షలాదిమంది కేబుల్ ఆపరేటర్లు ఉపాధి కోల్పోతున్నారని వారిని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్రావు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రేపు ఇందిరా పార్క్ వద్ద కేబుల్ ఆపరేటర్ల ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాకు మద్దతు తెలిపాలని రామ్చందర్రావును కేబుల్ ఆపరేటర్లు కోరారు.
తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఇంటర్నెట్ ఆపరేటర్ల సంఘం నాయకులు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుని కలిసి విన్నవించారు. ప్రభుత్వం ఏవేవో కారణాలు చెబుతూ కేబుల్ లను కట్ చేయడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. కేబుల్ ను కట్ చేయడం వల్ల ఇంటర్నెట్ సమస్యలు ఏర్పడి నిన్న కూడా సెక్రటేరియట్ లో నెట్ పనిచేయలేదు అన్నారు. వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం దీనిపై తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నించాలని రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు.