BRS పాలనలో రైతులు, కూలీల పిల్లలు కూడా వైద్యులు అవుతున్నారని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీశ్‌ రావు

సిద్దిపేట అక్టోబర్‌ 5 (ఇయ్యాల తెలంగాణ ):ఒకప్పుడు డబ్బులు ఉన్నవాళ్లే డాక్టర్లు అయ్యేవారని, కానీ బిఆర్‌ఎస్‌ పాలనలో రైతులు, కూలీల పిల్లలు కూడా వైద్యులు అవుతున్నారని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీశ్‌ రావు చెప్పారు. సిద్దిపేటలో నిర్మించిన వెయ్యి పడకల ప్రభుత్వ దవాఖానను మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. గాంధీ, ఉస్మానియా హాస్పిటళ్లలో ఉన్న సేవలు సిద్దిపేటలోనూ అందుబాటులోకి వచ్చాయన్నారు. గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు సిద్దిపేటలోనే చేసుకోవచ్చని చెప్పారు. రూ.15 కోట్లతో క్యాన్సర్‌ బ్లాక్‌కు శంకుస్థాపన చేశామన్నారు.దవాఖానలో 15 ఆపరేషన్‌ థియేటర్లు న్నాయని చెప్పారు. నాలుగో ఫ్లోర్‌లో 100 ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 30 ఎమర్జెన్సీ బెడ్స్‌ ఉన్నాయన్నారు. ఇకపై వైద్య సేవలకు హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. సిద్దిపేటలో డయాలసిస్‌ బెడ్లు 40 పెంచుతున్నామని వెల్లడిరచారు. రూ.23 కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. అన్నిరకాల వ్యాధులకు సిద్దిపేటలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. స్టాఫ్‌ నర్సులను నర్సింగ్‌ ఆఫీసర్‌ అని పిలిచేలా జీవో ఇచ్చామని వెల్లడిరచారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....