BRS కార్యాలయాన్ని కూల్చివేయండి..?

నల్గోండ జులై 1(ఇయ్యాల తెలంగాణ ): నల్లగొండ పట్టణం నడిబొడ్డున, అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ స్థలంలో నిర్మించిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఆకార్యాలయాన్ని  తక్షణమే కూల్చేయాలంటూ మున్సిపల్‌ కమిషనర్‌ ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఆదేశించారు. పేదవాడు సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే సవాలక్ష రూల్స్‌ రెగ్యులేషన్స్‌ పెడుతున్న విూరు.. 100 కోట్ల భూమిలో అనుమతి లేకుండా ఇంద్ర భవనం లాంటి పార్టీ ఆఫీస్‌ కడుతుంటే ఏం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చామని కమిషనర్‌ సమాధానం చెప్పగా.. నిబంధనల ప్రకారం వ్యవహరించాలి తక్షణమే కూల్చేయాలని మంత్రి ఘాటుగా స్పందించారు. అలాగే.. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా అనుమతుల్లేకుండా నిర్మించిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీస్‌ వ్యవహారాన్ని మానిటర్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి కి సైతం సూచించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....