BJP ఫ్లోర్‌ లీడర్‌గా ఏలేటీ మహేశ్వరరెడ్డి

హైదరాబాద్‌ ఫిబ్రవరి 14 (ఇయ్యాల తెలంగాణ) :  బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌గా ఏలేటీ మహేశ్వరరెడ్డిని ఆ పార్టీ హై కమాండ్‌ బుధవారం నాడు అధికారికంగా ప్రకటించింది. ఫ్లోర్‌ లీడర్‌తో పాటు మిగతా సభ్యులను కూడా అధిష్ఠానం నియమించింది. డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌గా పాయల్‌ శంకర్‌, చీఫ్‌ విప్‌గా పాల్వాయి హరీష్‌ బాబు, విప్‌గా ధన్‌ పాల్‌ సూర్యనారాయణ, ట్రెజరర్‌గా పైడి రాకేష్‌ రెడ్డి, ఆఫీస్‌ సెక్రటరీగా రామారావు పాటిల్‌ను బీజేపీ హై కమాండ్‌ నియమించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ 8 సీట్లను గెలుచుకున్న విషయం తెలిసిందే.కాగా.. ఏలేటి మహేశ్వర రెడ్డి నిర్మల్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఆయన ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే అసెంబ్లీ బీఏసీ సమావేశానికి 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో ఒకరిని పిలవాలని ఆ పార్టీ శాసనసభ్యులు స్పీకర్‌ను కోరారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డిని పిలవాలని బీజేపీ ఎమ్మెల్యేలంతా సంతకాలు చేసిన లేఖను స్పీకర్‌కు అందించిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వరరెడ్డి బీఏసీ సమావేశానికి హాజరయ్యారు. దీనిని బట్టి బీజేపీ శాసనసభా పక్షనేతగా ఏలేటి మహేశ్వరరెడ్డి పేరును బీజేపీ హై కమాండ్‌ ఖరారు చేసింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....