BJP, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లోనే విద్యుత్‌ లోటు: మంత్రి KTR

హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 4 (ఇయ్యాల తెలంగాణ) : బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలపై మంత్రి కేటీఆర్‌ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు కాంగ్రెస్‌ పరిపాలించే రాష్ట్రాల్లోనే విద్యుత్‌ లోటు అధికంగా ఉందని విమర్శించారు. 2013`14లో విద్యుత్‌ లోటుతో ఉన్న తెలంగాణ ఇప్పుడు మిగులు రాష్ట్రమని చెప్పారు.తలసరి విద్యుత్‌ వినియోగంలోనూ తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని చెప్పారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని వెల్లడిరచారు. అందుకే తెలంగాణ అభివృద్ధి మోడల్‌ దేశానికే ఉత్తమ నమూనా అంటూ ట్వీట్‌ చేశారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....