BJP ఎంఎల్‌ఎ అభ్యర్థిపై చేయిచేసుకున్న ACP

హైదరాబాద్‌ జూన్‌ 18 (ఇయ్యాల తెలంగాణ) :  బిజెపి ఎంఎల్‌ఎ అభ్యర్థిపై ఎసిపి చేయిచేసుకోవడం సంచలనం సృష్టించింది. ఓ హోటల్‌ మూసివేస్తుండగా బిజెపి నేత అమర్‌ సింగ్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. దీంతో వెంటనే అమర్‌ సింగ్‌పై ఎసిపి కిషన్‌ చేయి చేసుకున్నాడు. దీంతో అమర్‌ సింగ్‌ మద్దతుదారులు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగారు. ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కార్వాన్‌ బిజెపి అభ్యర్థిగా కిషన్‌ సింగ్‌ పోటీ చేశారు. ప్రజాప్రతినిధులు పోలీసులతో మర్యాదగా వ్యవహరించాలని లేకపోతే ఇలానే జరుగుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....