భారీ వర్షం పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు !

 సి. బెలగల్‌ మండల వ్యాప్తంగా శుక్రవారం రాత్రి శనివారం ఉదయం భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లాయి. గత రెండు నెలలుగా సరైన వర్షాలు లేక ఎండిపోతున్న మిరప, పత్తి, పంటలకు భారీ వర్షంతో ఉపశమనం లభించిందని రైతులు తెలిపారు. భారీ వర్షానికి పలుచోట్ల పంట పొలాలు మునిగి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. సి.బెళగల్‌ మండల వ్యాప్తంగా శనివారం 57.6 మిల్లీవిూటర్ల వర్షపాతం నమోదయిందని ఏఎస్‌ఓ ఆదినారాయణ తెలిపారు. 

అన్నదాతకు ఊరట: 

భూగర్భ జలాలు అడుగంటిపోతున్న తరుణంలో భారీ వర్షాలు అన్నదాతకు ఊరటనిస్తున్నాయి. ప్రధానంగా వాగుల వెంట, బోర్లు, బావులలో నీటిమట్టం పెరుగుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఖరీఫ్‌ సీజన్లో విత్తనాలు నాటిన సమయం నుండి ఇప్పటి వరకు సరైన వర్షాలు లేక సతమతమవుతున్న సమయంలో భారీ వర్షంతో రైతుల కష్టాలు తీర్చాయని ఆనందం వ్యక్తం చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....