BCల అభివృద్దిని గాలి వదిలేసినBRS

కుత్బుల్లాపూర్‌ ఆగష్టు 29 (ఇయ్యాల తెలంగాణ ):భారతీయ జనతాపార్టీ  ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ (జిల్లా,మండల అధ్యక్షులు)సమావేశాన్ని కొంపల్లి లోని ఏఎంఆర్‌ గార్డెన్స్‌ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి ఓబీసీ మొర్చా జాతీయ అధ్యక్షులు,రాజ్యసభ సభ్యులు డా’’ లక్ష్మణ్‌.బిజెపి ఎన్నికల కమిటీ చైర్మన్‌,హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నుండి దేశం గర్వించ దగ్గ స్థాయి కి వెళ్ళిన బిసి బిడ్డ నరేంద్ర మోడీ అని అన్నారు. బిసిలకు ,ఎస్సీలకు సబ్‌ ప్లాన్‌ అమలు చేసి వారి జీవితంలో వెలుగులు నింపాలని మొట్ట మొదట ప్రతిపాదన పెట్టింది బిజెపి పార్టీ అని అన్నారు. బిసి లకు న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బి అర్‌ ఎస్‌ పార్టీ వారి అభివృద్ధి ని గాలికి వదిలేసింది అని మండిపడ్డారు. అన్నిట్లో నెంబర్‌ వన్‌ రాష్ట్రం తెలంగాణ…అని చెప్పే కేసీఆర్‌ కు నంబర్‌ వన్‌ అంటే మధ్యంలో, భూ కబ్జాల్లో,లిక్కర్‌ స్కాం లలో,ప్రభుత్వ భూములు కొల్లగొట్టడం లో,ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేయడంలో అని మండిపడ్డారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....