APలో పవన్‌ ఫోటోలు పెట్టినట్టే భట్టి ఫోటోలు కూడా పెట్టాల్సిందే…!


మాజీ మంత్రి మోత్కపల్లి నర్సింహులు డిమాండ్‌

హైదరాబాద్‌ జూలై 16 (ఇయ్యాల తెలంగాణ) : అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి ఫోటోతో పాటు సమానంగా దళిత ఉపముఖ్యమంత్రి అయిన భట్టి విక్రమార్క ఫోటోను అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి మోత్కపల్లి నర్సింహులు డిమాండ్‌ చేసారు.. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ లోసీఎంతో సమానంగా పవన్‌ కళ్యాణ్‌ ఫోటోలు  ఉన్న విషయాన్ని ఈ సందర్బంగా మొత్కుపల్లి గుర్తు చేసారు. లంచాలు, ఫైరవీలు డబ్బుపై ఆశ లేకుండా నా హయాంలో పాలన చేశా. గత ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో నాకు పోటీ చేసే అవకాశం రాలేదదు. తెలంగాణలో నేను ఎక్కడ పోటీ చేసినా నాకు పది వేల ఓట్ల మేజారీటీ వస్తుంది. నాకు యాదగిరిగుట్టలో అర్ధ గజం భూమి లేదు… ఎలాంటి ఆస్తులు సంపాదించలేదు. సగెటప్‌.. ఎన్నికల్లో కోట్లకు విలువ ఉంది, ప్రజలకు సేవ చేసిన వాడికి విలువ లేదు. బడుగు బలహీన వర్గాల వారి తరఫున నేను ఎల్లప్పుడూ పోరాడుతానే ఉంటా’’తన భవిష్యత్తు కార్యచరణ పోరాటమే తప్ప భవిష ఏవిూలేదని మోత్కుపల్లివెల్లడిరచారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....