ANM లను వెంటనే పర్మనెంట్‌ చేయాలి

జగిత్యాల ఆగష్టు 24 (ఇయ్యాల తెలంగాణ ):మహిళలను రోడ్డెక్కింన్చడం సబబు కాదు ఇద్దరు ఒకే పని..జీతాల్లో వ్యత్యాసాలు ఎందుకు గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలకు వైద్య సేవలను అందిస్తూ, ఆరోగ్యాలను కాపాడుతున్న కాంట్రాక్ట్‌ రెండవ ఏఎన్‌ఎం లను పర్మనెంట్‌ చేయకుండా హక్కుల సాధనకోసం రోడ్డెక్కింన్చడం సరికాదని మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి, బతికేపల్లి సర్పంచి తాటిపర్తి శోభారాణి ఆరోపించారు. కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఏఎన్‌ఎం లను రెగ్యులర్‌ చేయలనే డిమాండు తో 8 రోజులుగా జగిత్యాల ఆర్డీవో కార్యాలయం ముందు తెలంగాణ ఎఎన్‌ఏం ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గానీడ్ల మధురిమ ఆధ్వర్యంలో సమ్మె చేస్తుండగా బుధవారం శోభారాణి పాల్గొని ఏఎన్‌ఎం లతో కలిసి మోకాళ్ళపై నిల్చుని నిరసన తెలిపారు. తహషిల్‌ చౌరస్తాలో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మమమల్ని రెగ్యులర్‌ చేసి మహిళలను గుర్తించాలని డిమాండ్‌ చేశారు.ఈ సందర్భంగా శోభారాణి  మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 5600 మంది ఏఎన్‌ఎం లు కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌, తదితర విభాగాల ద్వారా పనిచేస్తున్నారని , రెగ్యులర్‌ వారితో సమానంగా విధులు నిర్వహించాడమే కాకుండావైద్య సేవలు అందిస్తున్న జీతంలో వ్యత్యాసం ఎందుకని ప్రశ్నించారు.వీరితో పాటు మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ మెల్‌ ను కొన్ని నెలల క్రితం పర్మనెంట్‌ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఏఎన్‌ఎం లను రెగ్యులర్‌ చేయకుండా ఎందుకూ వివక్ష చూపుతుందని శోభారాణి మండిపడ్డారు.మహిళల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూడడం తగదని, మహిళలకు అన్యాయం జరుగుతునీటే ఎమ్మెల్సీ కవిత ఈ విషయంలో చొరవ చూపకపోవడం బాధాకరమని అమే పేర్కొన్నారు. మధురిమ మాట్లాడుతు కేవలం ఒకే ఒక్క  రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ తో మేము గత కొన్ని రోజులుగా వివిధ రకాలుగా నిరసన తెలుపుతున్న ప్రభుత్వం పట్టించుకోవలేదని అవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 33జిల్లాల్లో పనిచేస్తున్న ఏఎన్‌ఎం లు తీవ్ర ఆందోళన చేస్తున్నారని ప్రభుత్వం వెంటనే ఇతర శాఖల్లో చేసిన మాదిరిగానే మమ్మలని రెగ్యూలర్‌ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కెటిఆర్‌, హరీష్‌ రావు, ఎమ్మెల్సి కవిత లను మధురిమా కోరారు. కార్యక్రమంలో పద్మ, పి.శిరీష, మాదేశి శిరీష, నీరజ, సుప్రియ, జమున, గణిత, సుమలత, సునీత, జయప్రద, చిలకమ్మ, ఊర్మిళ, రమా, ప్రవిూల, ఎలిజబెత్‌ తదితరులు పాల్గొనారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....