America అబర్న్‌యూనివర్సిటీతో Telangana ఫారెస్ట్‌ కాలేజీ ఒప్పందం

ప్రతీయేటా ఇద్దరు ఎఫ్‌సీఆర్‌ఐ విద్యార్థులకు పూర్తి ఫండింగ్ తో మాస్టర్స్‌ డిగ్రీ 

అబర్న్‌ యూనివర్సిటీలో తెలంగాణకు హరితహారంపై 

ప్రజంటేషన్‌ ఇచ్చిన సీఎం OSD ప్రియాంక వర్గీస్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్ 16 (ఇయ్యాల తెలంగాణ) : అమెరికా అలబామా రాష్ట్రంలో ఉన్న ప్రముఖ యూనివర్సిటీ అబర్న్‌ లో ఫారెస్ట్రీలో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం తెలంగాణ విద్యార్థులకు దక్కనుంది. ఫారెస్ట్‌ కాలేజీ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఈఅఖీఎ) లో బీఎస్సీ ఫారెస్ట్రీ చదివిన విద్యార్థుల్లో ప్రతీ యేటా ఇద్దరికి ఎమ్సెస్సీ ఫారెస్ట్రీ కోసం పూర్తి ఫండిరగ్‌ ఇచ్చేందుకు అబర్న్‌ యాజమాన్యం అంగీకరించింది. ఈ మేరకు అమెరికా యూనివర్సిటీ ప్రాంగణంలో ఒప్పందం (ఓనీఙ) కుదిరింది. అబర్న్‌ యూనివర్సిటీ ఫారెస్ట్రీ కాలేజీ డీన్‌ డాక్టర్‌ జానకి అలవలపాటి, తెలంగాణ ఫారెస్ట్‌ కాలేజీ డీన్‌ ప్రియాంక వర్గీస్‌ లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. సంవత్సరానికి ఇద్దరు చొప్పున ప్రతిభావంతులైన విద్యార్థులకు ఫారెస్ట్రీలో ఎమ్మెస్‌ చదివేందుకు కుదుర్చుకున్న ఈ ఒప్పందం ఆరేళ్ల పాటు అమల్లో ఉంటుందని వారు తెలిపారు. అబర్న్‌ యూనివర్సిటీ ప్రతినిధులు విన్నీ నాథన్‌, డాక్టర్‌ క్రిస్టోఫర్‌ రాబర్ట్స్‌, బ్రెట్‌ వైట్‌, ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొన్నారు.  ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు చొరవ, ముందుచూపుతో ప్రారంభించిన అటవీ కలాశాలకు నేడు అంతర్జాతీయ గుర్తింపుతో పాటు, తెలంగాణ విద్యార్థులు అటవీ విద్యలో ఉన్నత చదువు, పరిశోధనలు, మంచి ఉద్యోగాల కల్పనకు ఈ ఒప్పందం దోహద పడుతుందని ప్రియాంక వర్గీస్‌ తెలిపారు. ఇందుకు సహకరించిన అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, చీఫ్‌ సెక్రటరీ, స్పెషల్‌ సీఎస్‌ (అటవీశాఖ) శాంతి కుమారి, పీసీసీఎఫ్‌ డోబ్రియాల్‌ కు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే డీమ్డ్‌ హోదా పొందనున్న ఎఫ్‌ సీఆర్‌ఐ, ఈ తరహా ప్రత్యేకంగా ఫారెస్ట్రీ విద్యకోసమే నెలకొల్పిన యూనివర్సిటీగా ప్రపంచంలోనే మొదటిది అవుతుందని తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....