Adwani కి భారతరత్నపట్ల విపక్షాల అభినందనల వెల్లువ

న్యూ డిల్లీ ఫిబ్రవరి 3 (ఇయ్యాల తెలంగాణ) : మాజీ ఉప ప్రధాని, రాజకీయ భీష్ముడు, బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎల్‌కే అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై కాంగ్రెస్‌ స్పందించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే అన్నారు. అయితే.. బీజేపీ ఇప్పటికీ నిలబడి ఉందంటే అందుకు కారణం అద్వానీనేనని, కానీ ఆ వాస్తవాన్ని చాలా ఆలస్యంగా గుర్తించారని దిల్లీకి చెందిన కాంగ్రెస్‌ నేత సందీప్‌ దీక్షిత్‌ తెలిపారు. ప్రతిపక్షాలలో, శివసేన (ఉద్ధవ్‌ వర్గం) సైతం ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. బాలాసాహెబ్‌ ఠాక్రే, సావర్కర్‌లకు ఇంకా భారతరత్న ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీకి ఈ అవార్డులు గుర్తుకు వస్తాయని ఉద్ధవ్‌ వర్గం నేత ఆనంద్‌ దుబే అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....