న్యూఢిల్లీ, ఏప్రిల్ 24, (ఇయ్యాల తెలంగాణ) : ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) రాజ్యసభలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాఘవ్ చద్దాతో పాటు మొత్తం ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. రాఘవ్ చద్దాతో కలిసి ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, అశోక్ మిట్టల్ వంటి ముఖ్య నేతలు కూడా పార్టీ మారడం ఢిల్లీ రాజకీయాల్లో సంచలనం సష్టిస్తోంది.శుక్రవారం విÖడియా సమావేశంలో మాట్లాడిన రాఘవ్ చద్దా, ఆప్‌లోని పది మంది రాజ్యసభ సభ్యుల్లో ఏడుగురు సభ్యులం బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఎంపీలు అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్‌లతో కలిసి విÖడియా సమావేశంలో మాట్లాడిన రాఘవ్ చద్దా, తమ వర్గం బీజేపీలో విలీనం అవుతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. “రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగా, రాజ్యసభలోని ఆప్ సభ్యుల్లో మూడింట రెండొంతుల మందిమి బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించుకున్నాం” అని ఆయన స్పష్టం చేశారు. “నేను ఆప్ కార్యకలాపాలకు దూరం కావడానికి గల కారణం ఇప్పుడు బయటపెడుతున్నాను… వారి నేరాల్లో నేను భాగం (ఆప్ అధిష్ఠానం) కావాలనుకోలేదు.. అందులో భాగం కాలేదు కాబట్టే మెప్పు పొందలేకపోయాను.. మా ముందు రెండే మార్గాలు కనిపించాయి.. ఒకటి రాజకీయాల నుంచి వైదొలగడం.. రెండు మా అనుభవాన్ని ఉపయోగించి సానుకూల రాజకీయాలు చేయడం.. అందుకే మేము రెండోది ఎంచుకుని. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాం ‘’ అని రాఘవ్ చద్ధా అన్నారు.
“ఆమ్ ఆద్మీ పార్టీ తన సూత్రాలు, నైతిక విలువలు, ఆదర్శాల నుంచి పక్కకు తప్పుకుంది. అది దేశం కోసం గానీ, దేశ నిర్మాణం కోసం గానీ కాకుండా, కేవలం తన స్వప్రయోజనాల కోసమే పనిచేస్తుంది. విÖలో చాలామంది ఈ విషయం నాకు చెప్పారు.. నేను తప్పుడు పార్టీలో ఉన్న సరైన వ్యక్తిని అని నాకు కూడా అనిపించింది” అని పేర్కొన్నారు.తనతో పాటు స్వాతి మాలివాల్, హర్భజన్ సింగ్, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సింహ్ సాహ్నీలు బీజేపీలో చేరుతారని తెలిపారు. రాజ్యసభలో మొత్తం 10 మంది ఆప్ సభ్యులుండగా.. మా ఏడుగురం కలిసి ఉన్నామని ఆయన చెప్పారు. ఆప్ పార్లమెంటరీ పార్టీ విలీనం కోరుతూ తాము సంతకాలు చేసిన లేఖలను రాజ్యసభ ఛైర్మన్‌కు సమర్పించినట్టు యువ ఎంపీ వెల్లడించారు.ఈ పరిణామంతో రాజ్యసభలో బీజేపీ బలం మరింత పెరగనుంది.
ప్రస్తుతం బీజేపీ 106 మంది సభ్యులతో పెద్దల సభలో అతిపెద్ద పార్టీగా కొనసాగుతోంది. తాజాగా ఆప్ నుంచి ఏడుగురు ఎంపీల చేరికతో బీజేపీ బలం 113కి పెరగనుంది. అంతేకాదు, మిత్రపక్షాలతో కలిపి బీజేపీ నేతత్వంలోని ఎన్డీయే కూటమి బలం 125కి చేరుతుంది.కొన్ని రోజుల క్రితమే రాఘవ్ చద్దాను రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఆప్ అధిష్ఠానం తొలగించింది. ఆయన స్థానంలో అశోక్ మిట్టల్‌ను నియమించింది. అయితే, ఇప్పుడు చద్దాతో పాటు ఆ కొత్త డిప్యూటీ లీడర్ అశోక్ మిట్టల్ కూడా బీజేపీలో చేరనుండడం గమనార్హం. పార్టీతో విభేదాల నేపథ్యంలో ఇటీవల చద్దా తన పార్లమెంటరీ పనితీరును వివరిస్తూ ఓ వీడియోను సోషల్ విÖడియాలో పోస్ట్ చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఈ తాజా పరిణామంతో ఆప్‌లో అంతర్గత సంక్షోభం తీవ్రస్థాయికి చేరినట్లు స్పష్టమవుతోంది.టీవలే రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి చడ్డాను కేజ్రీవాల్ తొలగించారు. ఇది జరిగిన కొన్ని రోజులకే చడ్డా పార్టీ మారడం సంచలనంగా మారింది. ఈ సందర్భంగా రాఘవ్ చడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. “నేను నా జీవితంలోని 15 ఏళ్లను ఆప్‌కు అంకితం చేశారు. కానీ ఆ పార్టీ నేడు అవినీతి పరుల చేతుల్లో ఉంది. నేను ఇన్నాళ్లూ తప్పుడు పార్టీలో ఉన్న సరైన వ్యక్తిని. ఇప్పుడు పార్టీకి దూరమై, ప్రజలకు దగ్గరవాలని నిర్ణయించుకున్నాను. మోదీ, అమిత్ షా నాయకత్వంలో పనిచేస్తాం” అని చడ్డా కుండబద్ధలు కొట్టారు. రాఘవ్ చడ్డాకు కేబినెట్ బెర్త్ దక్కే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
ఆప్ రియాక్షన్
రాఘవ్ చడ్డా ఆరోపణలపై ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ స్పందించారు. పార్టీ చడ్డాకు అన్ని ఇచ్చిందని అన్నారు. అయినా తన స్వార్థం కోసం బీజేపీలో చేరుతున్నారని విమర్శించారు. పంజాబ్ ప్రజలకు చడ్డా ద్రోహం చేశారని మండిపడ్డారు.