హైదరాబాద్, సెప్టెంబర్ 04 (ఇయ్యాల తెలంగాణ) : కొండా సురేఖ బర్తరఫ్ పై ఎంపీ డీకే అరుణ స్పందించారు. కొండా సురేఖ సీనియర్ మహిళా నాయకురాలు. కాంగ్రెస్ లోని ఇంటర్నల్ రాజకీయ విభేదాలు ఆమె ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ కి దారి తీసాయని భావిస్తున్నాను..రాజకీయాల్లో అనేక గ్రూపులు తగాదాలు ఉంటాయి.. కాంగ్రెస్ లో అవి రోజు చూస్తున్నాం. కొండా సురేఖ సీనియర్ నాయకురాలు, 2009 లో ఆమె నేను మంత్రులుగా కలసి పని చేశాం. నా తోటి ఒక మహిళ నాయకురాలు మంత్రిగా తెలంగాణ కు సేవలు అందిస్తున్నారని సంతోషపడ్డాం. ఆమెను బర్తరఫ్ చేయడం నిజంగా బాధకలిగించింది. బీసీలకు కాంగ్రెస్ పార్టీ,సీఎం ఎంతో చేశామని గొప్పలు చెప్పుకుంటారు. తాను బీసీ మహిళా. తన కూతురు ఏదో మాట్లాడిందని సురేఖ విÖద యాక్షన్ తీసుకోవడం సరికాదు, సమర్ధనీయం కాదు. ఒక మహిళ రాజకీయాల్లో కష్టనష్టాలను ఎదుర్కొని నిలబడటం, ఇంతవరకు రావడమనేది గొప్ప విషయం. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయడం సమర్ధనీయం కాదు. ఇప్పటివరకు బీజేపీలోకి ఆహ్వానించే అటువంటి చర్చలు ఏవీ జరగలేదన అన్నారు.
