👉 భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత
👉 కంట తడి పెట్టిన మాతంగి స్వర్ణలత
👉 నా విగ్రహ ప్రతిష్ట ఎందుకు చేయడం లేదు.. ఆరు నెలల్లో విగ్రహ ప్రతిష్ట జరగాలి
👉 నాకు అడ్డొచ్చిన వారిని పాదాల కింద నలిపేస్తా
👉 ఈ ఏడాది భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది.
👉 వావి వరసలు లేకుండా ప్రజలు వ్యవహారిస్తున్నారు
👉 మీ ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పాలి
👉 ఏ ఆపద వచ్చినా ప్రమాదం నుంచి కాపాడుతున్నా
👉 ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి
👉 ఈ ఏడాది కుంభవృష్టి వర్షాలు : భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత
హైదరాబాద్, ఆగస్టు 03 (ఇయ్యాల తెలంగాణ): సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు` ఘనంగా ముగిసాయి. సోమవారం భవిష్యవాణి (రంగం) కార్యక్రమంలో పచ్చికుండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణిని వినిపించింది. భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత కంట తడిపెట్టింది. ` ఈ ఏడాది కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మిమ్మలను ఇంత కింతకు కాపాడుకుంటూ వస్తున్నా, తనను మాత్రం సంతోష పరచడం లేదని తెలిపింది. ఆరు నెలల్లో విగ్రహ ప్రతిష్ట జరగాలని హెచ్చరించింది.ఈ ఏడూ కుంభవర్షాలతో ప్రజలు కొట్టుకుపోయే పరిస్థితి ఉందని ప్రాణనష్టం, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని హెచ్చరించింది. జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది. వావివరసలు లేకుండా జనాలు ప్రవర్తిస్తారని భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత తెలిపింది.
