హైదరాబాద్, ఆగస్టు 01 (ఇయ్యాల తెలంగాణ): తెలంగాణలో మహిళలను వేధిస్తున్న పోలీసుల జాబితలో మరో ఎస్సై పేరు చేరింది. మహిళలపై లైంగిక దాడి కేసులో ఎస్సై శ్రీకాంత్ అరెస్ట్ అయ్యాడు. సోషల్ విÖడియాలో పరిచయాలు పెంచుకొని మహిళలను మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగిక దాడి చేసినట్లు కేసు నమోదయింది. హైదరాబాద్ యువతి ఫిర్యాదుతో జగిత్యాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసారు. సాంకేతిక ఆధారాలతో నిజామాబాద్‌లో పోలీసులు నిందితుడిని గుర్తించారు. ఎస్సై శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసి హనుమకొండకు తరలించారు. నిందితుడు సిరిసిల్ల జిల్లాకు చెందిన ఎస్సైగా గుర్తించారు.
