హైదరాబాద్, మే 14 (ఇయ్యాల తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ యంసీ ) చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ కే.సత్యనారాయణ అధికారులతో కలసి గురువారం మధ్యాహ్నం చార్మినార్ సర్కిల్ పరిధిలోని ఛత్రినాక, చాంద్రాయణగుట్ట. మొఘల్‌పురా, ఉప్పుగూడ ప్రాంతాల్లో కొనసాగుతున్న జనగణన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్యూమరేటర్లు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే విధానాన్ని పరిశీలించి ఎన్యూమరేటర్లతో సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ వివరాలను నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా జోనల్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఏనుమరేటర్లు జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ప్రతి ఇంటిని సందర్శించి పూర్తి వివరాలు సేకరించాలని అధికారులకు సూచనలు చేశారు. ప్రజలు తమ ఇంటి వద్దకు వచ్చే ఎన్యూమరేటర్లకు సహకరించి సరైన సమాచారం అందించాలని కోరారు. జనగణన ప్రక్రియ సందర్భంగా ప్రత్యేక విధులు నిర్వహిస్తున్న అధికారులు ఎప్పటికప్పుడు స్థానిక ప్రాంతాల్లో పర్యటిస్తూ సమస్యలు రాకుండా చూడాలన్నారు. ఈ పర్యటనలో చార్మినార్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సరిత, అధికారులు, సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

