హైదరాబాద్, ఫిబ్రవరి 9, (ఇయ్యాల తెలంగాణ) : అధికారికంగా గ్రేటర్ హైదరాబాద్? మున్సిపల్? కార్పొరేషన్? మూడు మహా నగరపాలక సంస్థలుగా ఏర్పాటు కాలేదు గానీ పరిపాలన మాత్రం ఆ మేరకు మెల్లగా పట్టాలెక్కుతున్నట్లు కనబడుతుంది. మూడు జోన్లకు ఓ అదనపు కమిషనర్ చొప్పున నియమించిన ఆ ఇద్దరు అధికారులకు శనివారం జీహెచఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పరిపాలన బాధ్యతలపై స్పష్టమైన వివరాలను ఇచ్చారు. విÖకు కేటాయించిన జోన్లకు సంబంధించిన పరిపాలన వ్యవహారాలను చక్కదిద్దుకోవాలని, జోనల్ కమిషనర్లతో పని చేయించుకోవడం విÖ బాధ్యతే అని టెలీ కాన్ఫరెన్స్‌లో వారికి పలు రకాల సూచనలు చేశారు. కొనసాగింపుగా ఆయా జోన్ల పరిపాలన, ఆర్థిక, టౌన్ ప్లానింగ్ విభాగాలకు ఉన్నతాధికారులను సైతం నియమించారు.ప్రస్తుతం జీహెచ్?ఎంసీలో 12 జోన్లు, వాటి పరిధిలో 60 సర్కిళ్లు ఉన్నాయి. జీహెచఎంసీ పరిధి శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, గోల్కొండ జోన్లకు పరిమితం కానుంది. కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లతో గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీసీఎంసీ), మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్లతో గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(జీఎంఎంసీ) ఏర్పాటవుతాయని తెలుస్తోంది.
జీఎంఎంసీ పరిధి అదనపు కమిషనర్ వినయ్కష్ణారెడ్డి, జీసీఎంసీ పరిధికి ప్రస్తుత అదనపు కమిషనర్ సజనని కమిషనర్లుగా నియమిస్తూ పాలకమండలి పూర్తయ్యాక ఉత్తర్వు వెలువడుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. నూతన గ్రేటర్ కార్పొరేషన్ల టౌన్ ప్లానింగ్ వ్యవహారాల నిర్వహణను ఇద్దరు డైరెక్టర్ హోదాలో ఉన్న అధికారులకు అప్పగిస్తూ కమిషనర్ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై ఆయా జోన్ల పరిధిలోని నిర్మాణ అనుమతుల దరఖాస్తులు వారి ద్వారానే కమిషనర్ పర్మిషన్?కు వెళ్లనున్నాయి. విలీనంతో 300 డివిజన్ల పరిధిలోని నగరానికి 20శాతం మేర ఉద్యోగుల కొరత ఏర్పడింది. పారిశుద్ధ్య, టౌన్‌ప్లానింగ్ విభాగాల్లో ఎక్కువ ఖాళీలు ఉన్నాయని అధికారులు లెక్కలను తేల్చారు. మరో 1,500 మంది అవసరమని, ఉన్నతాధికారులతో తక్షణమే కమిటీ వేయాలని నిర్ణయించారు.జీహెచ్?ఎంసీ పాలకమండలి గడువు వచ్చే ఫిబ్రవరి 10తో ముగియనుంది. తర్వాత 300 డివిజన్లను మూడు భాగాలుగా చేసే ప్రక్రియ అధికారికంగా మొదలుకానుంది. మార్చి లేదా ఏప్రిల్‌లో ఎన్నికలు ఉంటాయనే ప్రచారం విస్తతంగా జరుగుతోంది. జులై నాటికి నిర్వహించకపోతే 2027 వరకు జరిగే అవకాశం ఉండదని సంబంధిత అధికారులు పలు విశ్లేషణలు చేస్తున్నారు. జనగణన పూర్తవుతుందని, కొత్త జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేపట్టి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు.వంద, రెండు వందలు కాదు. ఏకంగా 4 వేలకుపైగా ఫిర్యాదులు జీహెచ్?ఎంసీ విస్తరణ సమస్యపై బుట్ట దాఖలయ్యాయి.
డివిజన్లు పెంచండి, హద్దులు మార్చండంటూ రాజకీయ నేతలు, శివారు ప్రాంత ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను జీహెచఎంసీ నిర్మొహమాటంగా తిరస్కరించడం పట్ల వారిలో ఆందోళన నెలకొంది. అందులో 90 శాతం అర్జీలు వేర్వేరు రాజకీయ పార్టీల నేతలవి కావడం గమనార్హం. ముందుగా నిర్ణయించుకున్నట్లుగానే డివిజన్ల పునర్విభజనను పూర్తి చేశారనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపస్తున్నాయి. జనాభా, విస్తీర్ణం దష్ట్యా సమతూకం పాటించలేదని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలే కాకుండా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా జీహెచ్?ఎంసీ విస్తరణను సవరించాలని కోరుతున్నారు.ఈ విస్తరణతో జీహెచఎంసీ పరిధితో సరిపడా భూలభ్యత, రవాణా, నివాసం, వర్షపు నీటి పారుదల, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో సమగ్ర మెట్రోపాలిటన్ ప్రణాళికలు అమలు చేసే అవకాశం ఉంది. అలాగే కొత్తగా విలీనమైన ప్రాంతాలకు జీహెచఎంసీ నిధులు, సాంకేతిక నైపుణ్యం, పారిశుధ్యం, దోమల నివారణ, ఘన వ్యర్థాల నిర్వహణ, ప్రజారోగ్యం, అత్యవసర సేవలు వంటి ప్రామాణిక పౌర సేవలు మరింత మెరుగ్గా అందే అవకాశం ఉంది. ప్రపంచస్థాయి మెట్రోపాలిటన్ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే దిశగా ఈ ప్రక్రియ కీలక ఘట్టమని ప్రభుత్వం భావిస్తోంది.
