హైదరాబాద్, డిసెంబర్ 12 (ఇయ్యాల తెలంగాణ) : గత నాలుగేళ్లుగా అంబర్పేట్ నియోజకవర్గ పరిధిలోని చే నెంబర్ నుంచి గోల్నాక వైపు జరుగుతున్న రోడ్ పనుల కారణంగా అంబర్పేట్, ఉప్పల్, రామంతపూర్ పరిధి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరికి ఈ సమస్యకు పరిష్కారం లభించింది. అంబర్పేట్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ చొరవ తో ఈ సర్వీస్ రోడ్ ప్రారంభమైంది.
ఈ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గనున్నాయని బి ఆర్ఎస్ సీనియర్ నాయకుడు చింతల నరసింహారెడ్డి తెలిపారు. రోడ్డులో రాకపోకలు ప్రారంభమైన నేపథ్యంలో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.తరువాత బిఆర్ఎస్ పార్టీ నాయకులు నూతనంగా ప్రారంభించిన ఈ సర్వీస్ రోడ్డును పరిశీలించారు.
