
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (ఇయ్యాల తెలంగాణ) : పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకు తెలంగాణ హైకోర్టు లో ఎదురుదెబ్బ తగిలింది. బెనిఫిట్ షో, టికెట్ రేట్లు పెంపు మెమోను కోర్టు సస్పెన్షన్లో పెట్టింది. ఎజీ ‘ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. ఈ ఆదేశం సినిమా ప్రేక్షకుల్లో చర్చనీయాంశంకాగా, ఫిల్మ్ ఇండస్ట్రీకి షాకింగ్ గా మారింది.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ‘ఓజీ’ సినిమాకు ప్రత్యేకంగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు, బెనిఫిట్ షోలు నిర్వహించేందుకు అనుమతి ఇస్తూ మెమో జారీ చేసింది. ఈ మెమో.. సాధారణ టికెట్ ధరలతో పాటు అదనపు ఛార్జీలు వసూలు చేసి, ప్రేక్షకుల నుంచి ఎక్కువ ఆదాయం సంపాదించుకునేందుకు వీలు కల్పిస్తుంది. అయితే, ఈ నిర్ణయంపై నమోదైన కేసును పరిశీలించిన తెలంగాణ హైకోర్టు, దీన్ని తాత్కాలికంగా ఆపేసింది. ఈ ఉత్తర్వులు ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ఉన్నాయని, ప్రేక్షకుల హక్కులను దెబ్బతీస్తాయని స్పష్టం చేసింది.
