6 గ్యారంటీలు రాష్ట్ర బడ్జెట్‌ గాడిద గుడ్డేనా ? కేంద్ర Home శాఖ సహాయ మంత్రి బండి

హైదరాబాద్‌, జులై 25 (ఇయ్యాల తెలంగాణ) : గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో.. కాంగ్రెస్‌ ఇచ్చిన హావిూలన్నీ అమలు చేయడం అంతే నిజమనే దానికి బడ్జెట్‌ నిదర్శనం. భట్టి విక్రమార్క. విూరు చదివింది ఆర్దిక బడ్జెట్టా లేక అప్పుల పత్రమా..? అప్పులున్నందున హావిూలను అమలు చేయలేమని చేతులెత్తేస్తున్నారా? అప్పులున్న విషయం ముందు విూకు తెలిసి కూడా 6 గ్యారంటీలిచ్చిన విూరు వాటన్నింటికీ బడ్జెట్‌ లో నిధులెందుకు కేటాయించలేదు? 6 గ్యారంటీలుసహా హావిూల అమలుపై చర్చ జరగకుండా ఉండేందుకే కేంద్రాన్ని బదనాం చేయాలనుకుంటున్నారా? బడ్జెట్‌ కేటాయింపులకు సరిపడ ఆదాయం ఎక్కడి నుండి సమకూర్చుకుంటారో బడ్జెట్‌ లో లెక్కా పత్రం చూపకపోవడం విడ్డూరమని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. 

సర్కారీ భూములన్నీ అడ్డికి పావుశేరు అమ్మాలనుకుంటున్నారా? ఔను. హావిూలను అమలు చేయడం చేతకాని కాంగ్రెస్‌ కు మాటలెక్కువని బడ్జెట్‌ చూస్తే అర్ధమవుతోంది. 12 వేల పోస్టులకే నోటిఫికేషన్‌ ఇచ్చిన విూరు 31 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పడం నిరుద్యోగులను మోసం చేయడమే. .లక్షన్నర కోట్లతో నిర్మిస్తామన్న మూసీ రివర్‌ ఫ్రంట్‌ కు బడ్జెట్‌ లో పైసా కేటాయించని విూరా కేంద్రంపై విమర్శలు చేసేది? రంజాన్‌ వేడుకలకు రూ.33 కోట్లు కేటాయించిన ప్రభుత్వం హిందువుల పండుగలకు నయాపైసా   కేటాయించకపోవడం మతతత్వం  కాదా? ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ హిందూ ప్రజలకు తీవ్రమైన నష్టం చేయడమేనా మైనారిటీ డిక్లరేషన్‌ అంటే? రుణమాఫీవల్ల రైతులకు లాభం కంటే నష్టమే జరిగిందని ప్రభుత్వమే ఒప్పుకుంది.

రైతులకు జరిగిన నష్టాన్ని పూడ్చి డిఫాల్టర్ల జాబితా నుండి తొలగిస్తారా? లేదా? చెప్పాలి ఏడాదిపాటు నష్టపోయిన రైతు భరోసా, రూ.500 బోనస్‌, పంట నష్ట పరిహారం నిధులను కూడా ఈ ఏడాది చెల్లిస్తారా? లేదా? జాతీయ వ్రుద్ధి రేటు కంటే తెలంగాణ వ్రుద్ధి రేటు తక్కువ నమోదు కావడమే 10 ఏళ్ల కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పాలనకు అద్ధం పడుతుందని అన్నారు. ఇప్పటికైనా పీఎం ఫసల్‌ బీమాలో చేరాలని నిర్ణయించడం సంతోషం. 90 లక్షల తెల్ల రేషన్‌ కార్డులుంటే. 39 లక్షల మందికే గ్యాస్‌ సబ్సిడీ ఇచ్చి గొప్పలు చెప్పుకోవడం దారుణం. 50 లక్షల మంది అర్హులకు రూ.500 సబ్సిడీని ఎగ్గొట్టి మహిళల్లో వెలుగులు నింపామని చెప్పుకోవడం సిగ్గు చేటు. ఇందిరమ్మ ఇండ్లు, ట్రిపుల్‌ ఆర్‌ నిర్మాణంలో కేంద్ర నిధులున్నాయని బడ్జెట్‌ లో ప్రస్తావించకపోవడం విడ్డూరం.

బడ్జెట్‌ లోని చివరి పేజీలో ప్రస్తావించిన మహాత్ముడి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాష్ట్ర ఆర్దిక పరిస్థితి, అప్పులకు. విూరిచ్చిన అలవి కాని హావిూలకు మధ్య ఉన్న అంతరాన్ని గ్రహించండి. కాంగ్రెస్‌ ఇచ్చిన హావిూలను రాబోయే ఐదేళ్లలో కూడా అమలు చేయడం అసాధ్యమని బడ్జెట్‌ లోనే తేలింది. బడ్జెట్‌ లో ఏ ఒక్క నియోజకవర్గం ఊసే లేదు. సీఎంసహా మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తారా? కేంద్ర బడ్జెట్‌ ప్రసంగంలో తెలంగాణ పేరు రాలేదని. రాష్ట్రానికి ఘోర అన్యాయం ప్రజలను రెచ్చగొట్ట్టిన కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర బడ్జెట్‌ లో ఏ ఒక్క జిల్లా, నియోజకవర్గం ప్రస్తావన చేయలేదు కదా. దీనికేం సమాధానం చెబుతారు? బడ్జెట్‌ లో పేరు ప్రస్తావించకపోయినంత మాత్రాన ఆ ప్రాంతాలకు అన్యాయం చేసినట్లా? రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తారా

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....