57వసతి గృహం మూడో అంతస్తు నుండి దూకి విద్యార్థి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌ జూలై 10 (ఇయ్యాల తెలంగాణ ); మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌ లోని మల్లారెడ్డి అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో విద్యార్థి పురుగులు మందు తాగి అనంతరం భవనం పైనుంచి కిందకు దూకాడు. బుధవారం మధ్యాహ్నం మూడో సంవత్సరం చదివే హరినాథ్‌ అనే విద్యార్థి పురుగుల మందు తాగి తరువాత వసతి గృహం మూడో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. హాస్టల్‌ బిల్డింగ్‌ విూది నుంచి దూకుతుండగా విద్యుత్‌ వైర్లు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఏమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....