5 వేల కోట్ల కోసం 42 ఎకరాల Land అమ్మకం

హైదరాబాద్, జనవరి 21 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్‌లో మరోసారి భూములు వేలం వేయడానికి తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మూసాపేట, బంజారాహిల్స్, కొండాపూర్‌లో మొత్తం 42 ఎకరాలను వేలం వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని ద్వారా సుమారు రూ. 5 వేల కోట్లు సేకరించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. దీనికి సంబంధించి హెచఎండీఏ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. అయితే గతంలో హైదరాబాద్‌లో జరిగిన భూముల వేలాల్లో రికార్డు ధరలు పలికాయి. దీంతో ఈసారి కూడా భారీ స్పందన వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో మరోసారి భూములు వేలం వేయడానికి సిద్ధమవుతోంది. మొత్తం 42 ఎకరాల భూమి వేలం వేయాలని నిర్ణయించింది. దీని ద్వారా దాదాపు రూ. 5 వేల కోట్లు సేకరించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. కాగా, భాగ్యనగరంలో భూములు వేలం వేసిన ప్రతిసారి రికార్డు ధరలు పలుకు తున్నాయి. ఇటీవల కోకాపేటలో ఎకరం రూ. 151 కోట్లు పలికింది. అంతకుముందు రాయదుర్గంలో జరిగిన వేలంలో ఎకరం ఏకంగా రూ. 177 కోట్లు పలికి రికార్డు సష్టించింది. ఈ తరుణంలో త్వరలో జరగబోయే వేలంలో ఎకరం ఎంత పలుకుతుంది అనేది ఆసక్తిగా మారింది.మూసాపేటలో 14 ఎకరాలు, బంజారాహిల్స్‌లో 8.37 ఎకరాలు, కొండాపూర్‌లో 20 ఎకరాల వేలం వేయడానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచఎండీఏ) కసరత్తు చేస్తోంది. దాదాపు రెండు నెలల క్రితం కోకాపేటలో భూములు వేలం వేసినప్పుడే.. మూసాపేటలో భూములను కూడా విక్రయించాలనిలని ప్రభుత్వం భావించింది. అయితే భూములు వేలం వేయొద్దంటూ స్థానికులు, ప్రజాప్రతినిధుల నుంచి వ్యతిరేకత రావడం వల్ల.. ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కాగా, ఆ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపడు తున్నారని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో మరోసారి ఈ భూముల వేలం మరోసారి తెరపైకి వచ్చింది. ఆ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం.. స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చలు జరిపి భూములను వేలం వేసేందుకు ఆమోదం తెలిపింది.

బంజారా హిల్స్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సుమారు 15 ఎకరాల వరకు ఉన్న భూమి.. చాలా వరకు కబ్జాకు గురైంది. ప్రభుత్వ స్థలంలోకి నిర్మాణాలు చొచ్చుకొచ్చాయి. దీంతో కొండ ప్రాంతాన్ని పక్కకు పెట్టి.. 8.37 ఎకరాలను విక్రయించాలని ప్రభుత్వం భావించింది. కొండాపూర్‌లో 20 ఎకరాలు, మూసాపేటలోని 14 ఎకరాలు కలిపి మొత్తం 42 ఎకరాలను ఆన్‌లైన్‌లో వేలం వేసేందుకు హెచఎండీఏ కసరత్తు చేస్తోంది.మరోవైపు, హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా అభివద్ధి చెందుతోంది. భారత్‌లోని టాప్ నగరాలతో పోటీ పడుతూ అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా గుర్తింపు పొందుతోంది. మౌలిక సదుపాయాలు, మానవవనరులు పుష్కలంగా ఉండటంతో.. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను ప్రారంభించడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టాలనుకునే సంస్థలకు భూములు దొరకడం కష్టంగా మారింది. ప్రైవేటు స్థలాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నా.. విక్రయించడానికి యజమానులు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో గతంలో టీజీఐఐసీ, హెచఎండీఏలు వేలం వేసిన భూములకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మూసాపేట, బంజారాహిల్స్, కొండాపూర్‌లో కూడా అలాంటి రెస్పాన్స్ వచ్చి.. రూ. 5 వేల కోట్ల టార్గెట్ చేరుకుంటామని ప్రభుత్వం భావిస్తోంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....