5 days రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి. జోరుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభిస్తున్నది. వర్షాలకు వదరలు పోటెత్తుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాగల ఐదురోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడిరచింది వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్‌`ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుందని తెలిపింది. అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 7.5 కిలోవిూటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌లోని గంగా తీర ప్రాంతాలు, ఉత్తర ఒడిశా, వాయువ్య బంగాళాఖాతం నుంచి తెలంగాణ విూదుగా ఒడిశా వరకు ద్రోణి కొనసాగుతుందని.. సముద్రమట్టానికి 1.5 కిలోవిూటర్లు, 3.1 కిలోవిూటర్ల వరకు కొనసాగుతుందని తెలిపింది. ఈ నెల 25న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

26న ఏపీ తీరాన్ని ఆనుకొని వాయువ్య, పశ్చిమ`మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. 27న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని వివరించింది. ఈ క్రమంలో తెలంగాణలో అతిభారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. బుధవారం వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పింది.గురువారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అంచనా వేసింది. శుక్రవారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. శనివారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....