అలుపెరుగని సహాయం
49వ రోజు భాజపా కరోనా వారియర్స్ అన్న వితరణ
హైదరాబాద్ , మే 14 ( ఇయ్యాల తెలంగాణ ) భాజపా కరోనా వారియర్స్ టీం సనత్ “ఫీడ్ ది నీడి” 49వ రోజు కార్యక్రమానికి సనత్ నగర్ లోని సుభాష్ నగర్ వాస్తవ్యులు సందీప్ శర్మ షీలా లు ఆర్థిక సహాయం అందించినట్లు కార్యనిర్వాహకులు భాజపా మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యేచన్ సురేష్ మరియు ఆకూరి శ్రీనివాస్ రావు లు తెలిపారు.
భాజపా యువమోర్చా నాయకుడు పి సునీల్ కుమార్, దళిత మోర్చా నాయకుడు పొలిమేర సంతోష్ కుమార్ లు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫతేనగర్ వాస్తవ్యులు యార మోహన్ ముదిరాజ్ తో కలిసి స్వామి టాకీస్ కాంప్లెక్స్ లేబర్ అడ్డా వద్ద అన్నార్థులకు ఆహార పొట్లాల వితరణ చేశారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తాళ్ళ జైహింద్ గౌడ్, లక్ష్మణ్ పటేల్, విట్టల్ మురళి, ఫణిమాల, సరిత శ్రీనివాస్ గౌడ్, మిథుల్ రాజ్, దుర్గ, కార్తీక్ వారణాసి, బంటి, కిషోర్, ధర్మేంద్ర, భాను, రాజు, జె కె ఠాకూర్ తదితరులు సహకారం అందించారు.