1:50 అంటున్న TSPSC…

హైదరాబాద్‌, జూలై 5, (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణలో గ్రూప్‌`1 మెయిన్స్‌ పరీక్షకు అభ్యర్థులను 1:100 నిష్పత్తిలో ఎంపికచేయాలంటూ ఒకపక్క నిరుద్యోగులు డిమాండ్లు చేస్తుంటే.. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మాత్రం తగ్గేదేలే అంటోంది. గ్రూప్‌`1 ప్రిలిమ్స్‌ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి 1:50 నిష్పత్తిలోనే ‘గ్రూప్‌`1’ మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ప్రకటించింది. గ్రూప్‌`1 ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ ఆధారంగా మెయిన్స్‌ పరీక్షకు సాధారణ పరిపాలనశాఖ జారీచేసిన ఉత్తర్వుల(జీవో నెం. 55, 29)లోని నిబంధనల ప్రకారం 1:50 నిష్పత్తిలోనే ఎంపిక చేస్తామని స్పష్టం చేసింది. గ్రూప్‌`1 మెయిన్స్‌ పరీక్షకు అభ్యర్థుల ఎంపికపై హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా..  వారి అభ్యర్థనలను పరిశీలించిన టీజీపీఎస్సీ మెయిన్స్‌ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపికచేయడం సాధ్యం కాదని తెలిపింది. ఈ మేరకు అభ్యర్థుల అభ్యర్థనలను తిరస్కరిస్తున్నట్లు వెల్లడిస్తూ ఇటీవల టీజీపీఎస్సీ మెమో జారీచేసింది.

’గ్రూప్‌`1’ ప్రిలిమినరీ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని ఇటీవల కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.. అభ్యర్థుల అభ్యర్థనలను పరిశీలించాలని కమిషన్‌కు సూచించింది. చట్టానికి లోబడి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని, ఆ నిర్ణయాన్ని అభ్యర్థులకు తెలియజేయాలని కమిషన్‌ను ఆదేశించింది. ఈ మేరకు అభ్యర్థుల అభ్యర్థనలను పరిశీలించిన టీజీపీఎస్సీ.. వాటిని తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు హైకోర్టులో మెమో దాఖలు చేసింది. అయితే దీనిపై నిరుద్యోగుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

అభ్యర్థనల తిరస్కరణకు కమిషన్‌ చెప్పిన కారణాలు ఇవీ..

? ప్రభుత్వ సాధారణ పరిపాలనశాఖ జారీ చేసిన ‘జీవో నెం.55’ను సవరణ చేస్తూ ‘జీవో నం.29’ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవోలోని నిబంధనలకు అనుగుణంగా గ్రూప్‌`1 మెయిన్స్‌ పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని గ్రూప్‌`1 నోటిఫికేషన్‌ జారీ అయింది.

? గ్రూప్‌`1 మెయిన్స్‌ పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక విషయం జీవో నెం.29లోని పేరా నం.5లో స్పష్టంగా ఉంది.

? ప్రతి మల్టీజోన్‌లో ఖాళీల సంఖ్యకు అనుగుణంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

? తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్‌ సర్వీసు రూల్స్‌ `1996లోని 22, 22ఏ నిబంధనల మేరకు సంబంధిత రిజర్వుడ్‌ కేటగిరీల్లో అభ్యర్థుల సంఖ్య తక్కువైతే, అందుకు అనుగుణంగా ఆ కేటగిరీల నుంచి అదనంగా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది.

? ప్రధాన పరీక్షకు అభ్యర్థుల ఎంపికపై ఉద్యోగ ప్రకటన నం.02/2024లోని పేజి నం.16లోని పేరా 12 లోని పేరా బీ లోనూ 1:50 నిష్పత్తిలో ఎంపికపై స్పష్టంగా పేర్కొన్నారు.

? ప్రభుత్వ సాధారణ పరిపాలనశాఖ జారీ చేసిన ‘జీవో నెం.55’ను సవరణ చేస్తూ ‘జీవో నం.29’ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవోలోని నిబంధనలకు అనుగుణంగా గ్రూప్‌`1 మెయిన్స్‌ పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని గ్రూప్‌`1 నోటిఫికేషన్‌ జారీ అయింది.

? గ్రూప్‌`1 మెయిన్స్‌ పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక విషయం జీవో నెం.29లోని పేరా నం.5లో స్పష్టంగా ఉంది.

? ప్రతి మల్టీజోన్‌లో ఖాళీల సంఖ్యకు అనుగుణంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

? తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్‌ సర్వీసు రూల్స్‌ `1996లోని 22, 22ఏ నిబంధనల మేరకు సంబంధిత రిజర్వుడ్‌ కేటగిరీల్లో అభ్యర్థుల సంఖ్య తక్కువైతే, అందుకు అనుగుణంగా ఆ కేటగిరీల నుంచి అదనంగా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది.

ప్రభుత్వ ఉత్తర్వులు, నిబంధనలకు లోబడి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు విడుదల చేసి, ఖాళీలను భర్తీ చేస్తుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల అభ్యర్థనలను పరిశీలించిన తరువాత వాటిని తిరస్కరిస్తున్నట్లు టీజీపీఎస్సీ స్పష్టం చేసింది

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....