100 నిరుపేద కుటుంబాలకు సరుకుల కిట్లు పంపిణీ
హైదరాబాద్ మే 25 (ఇయ్యాల తెలంగాణ)
బహదూర్ నియోజక వర్గం లోని హోసింగ్ బోర్డు కాలనీ,కిషన్ బాగ్ తదితర ప్రాంతాలలోని నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేయడం జరిగింది. AIMIM పార్టీ అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసి ఆదేశాల మేరకు బహదూర్ పుర ఎమ్మెల్యే మహమ్మద్ మోజం ఖాన్ పర్యవేక్షణలో పలు ప్రాంతాలలో ఈ రోజు 100 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లను స్థానిక కార్పొరేటర్ మహమ్మద్ సలీం నిరుపేదలకు అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ లాక్ డౌన్ మూలంగా ఏంతో మంది నిరుపేద కుటుంబాలు పస్తులు ఉంటున్నారని ఎం ఐ ఎం పార్టీ అధినేత ఆదేశాల మేరకు నిరుపేదలకు అందుతున్న సహాయం గొప్ప కార్యమని గుర్తుచేశారు. పేద ప్రజలెవరూ పస్తులుండకూడదనేది ఎం ఐ ఎం ఉద్దేశమని తెలిపారు.