హైదరాబాద్‌ లో దంచికొట్టిన వర్షం.. రోడ్లన్నీ జలమయం

హైదరాబాద్‌ సెప్టెంబర్ 6 (ఇయ్యాల తెలంగాణ );హైదరాబాద్‌ నగరంలో లో పలు చోట్ల కుండపోతగా వర్షం కురిసింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతూనే ఉంది. ఖైరతాబాద్‌, అవిూర్పేట, సోమాజీగూడ, నాంపల్లి, మలక్పేట, సైదాబాద్‌, పాతబస్తీ, ఎల్బీనగర్‌, సాగర్రింగ్‌ రోడ్‌, హస్తినాపురం, బీఎన్రెడ్డి, నాగోల్‌, ఉప్పల్‌, హబ్సిగూడ, తార్నాక, ఈసీఐఎల్‌, సికింద్రాబాద్‌, బేగంపేట, అడ్డగుట్ట, మారేడుపల్లి, ప్యాట్నీ, ప్యారడైస్‌, బోయిన్పల్లి, సుచిత్ర, కొంపల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, బొల్లారం, చిలకలగూడ, కూకట్పల్లి, హైదర్నగర్‌, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, కేపీహెబీ కాలనీ, ఆల్విన్‌ కాలనీ, మియాపూర్‌, కుత్భుల్లాపూర్‌, బీహెచ్‌ఈఎల్‌, కొండాపూర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, మెహదీపట్నంలో వాన దంచికొడుతున్నది.. కుత్బుల్లాపూర్‌ గాజులరామారాం లోని బాలజీ లేఅవుట్‌, వోక్షిత ఎంక్లేవ్‌ ఆదర్ష్‌ నగర్‌ ప్రాంతాలలో  రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. ఎగువ పెద్ద చెరువు అలుగు ద్వారా నీరు  చేరుతుంది.  ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి మళ్లీ ప్రవాహం పెరిగి రోడ్లు జలమయంఅయ్యాయి. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....