హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా సందీప్‌ శాండిల్య నియామకం

హైదరాబాద్‌ అక్టోబర్‌ 13 (ఇయ్యాల తెలంగాణ ): హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా సందీప్‌ శాండిల్య నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సందీప్‌ శాండిల్య పోలీసు అకాడవిూ ైరెక్టర్‌గా ఉన్నారు. ఈసీ ఆదేశాలకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రం పంపిన ప్యానల్‌ నుంచి అధికారులను ఈసీ ఎంపిక చేసింది.యాదాద్రి కలెక్టర్‌గా హనుమంత్‌, నిర్మల్‌ కలెక్టర్‌గా ఆశీష్‌ సంగ్వాన్‌, రంగారెడ్డి కలెక్టర్‌గా భారతీ హోలీకేరి, మేడ్చల్‌ కలెక్టర్‌గా గౌతం, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్‌, ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శిగా సునీల్‌ శర్మ, ఎక్సైజ్‌ కమిషనర్‌గా జ్యోతి బుద్ధ ప్రకాశ్‌, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా క్రిస్టినా నియామకం అయ్యారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....