హైదరాబాద్లో బంగ్లాదేశీయుల అక్రమ కార్యకలాపాలు : MLA రాజా సింగ్‌ ట్వీట్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్‌ నగరంలో మరోసారి బంగ్లాదేశీయులు  అక్రమ కార్యకలాపాలు చేస్తూ పట్టుబడ్డారని ఎమ్మెల్యే రాజా సింగ్‌ ట్వీట్‌ చేశారు. ఆయన తన ట్వీట్లో ‘‘నకిలీ హిందూ పేర్లను ఉపయోగించి బంగ్లాదేశ్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌ నుంచి హైదరాబాద్లో రోహింగ్యాలు చొరబడ్డారు. అలాగే వారు ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా వంటి ప్రధాన నగరాల్లో వ్యాపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల  కారణంగా, హైదరాబాద్‌ పాతబస్తీ  అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాలకు బలమైన కోటగా మారింది. అక్రమంగా దేశంలోకి చొరబడిన వీరుసెక్స్‌ రాకెట్‌, మానవ అక్రమ రవాణాకు పాల్పడినట్లు ఈ రోజు వెల్లడైంది. ఇలాంటి ఘటనలపై పాతబస్తీలోని ముస్లిం నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇది అందరూ ఆలోచించాల్సిన సమయం.. అక్రమ చొరబాట్లు  కేవలం భద్రతకు ముప్పు మాత్రమే కాదు. హైదరాబాద్‌ భవిష్యత్తు పై దాడి. తెలంగాణ వ్యాప్తంగా అక్రమ చొరబాటుదారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడానికి ఐపీఎస్‌ అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేయాలి.’’ అని తన ట్వీట్‌ ద్వారా ఎమ్మెల్యే రాజా సింగ్‌ డిమాండ్‌ చేశారు. కాగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ కవిూషనర్‌ టాస్క్‌ ఫోర్స్‌ , సౌత్‌ జోన్‌ టీమ్‌, చాదర్ఘాట్‌, ఖైరతాబాద్‌ పోలీసులు ఏకకాలంలో చాదర్ఘాట్‌, ఖైరతాబాద్లోని అక్రమ వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించి (18) అక్రమ వలసదారులను అరెస్టు చేశారు. వీరంతా పశ్చిమ బెంగాల్‌ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించినట్లు తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....