బాలానగర్ జులై 22, (ఇయ్యాల తెలంగాణ ):శాపూర్ నగర్ లోని బాలానగర్ జోన్ డీసీపీ కార్యాలయంలో బాలానగర్ డిసిపి శ్రీనివాస్ రావ్ ఆద్వర్యంలో విూడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…బాచూపల్లి, సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలలో నిషేధిత (ద్రవ రూపంలో ఉన్న గంజాయి) హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను బాలనగర్, మాదాపూర్ ఎస్ ఓ టి పోలీసులు పట్టుకున్నారని, వారి వద్ద నుండి 5ఎశ్రీ తో ఉన్న 300(230 బాచుపల్లి, 70 సనత్ నగర్) బాటిళ్ళ నిషేధిత హాష్ ఆయిల్ తో పాటు, నాలుగు సెల్ ఫోన్లు, ఒక కారు, 4వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ముగ్గురు నిందుతులని రిమాండ్ తరలించామని, మరోకరు పరారీలో ఉన్నట్లు బాలనగర్ డీసీపీ శ్రీనివాస్ రావు వెల్లడిరచారు.
- Homepage
- Telangana News
- హాష్ ఆయిల్ స్వాధీనం
హాష్ ఆయిల్ స్వాధీనం
Leave a Comment