హాఫ్‌ టికెట్‌గాళ్లకు కూడా టికెట్లు ఇచ్చారు: విష్ణువర్ధన్‌ రెడ్డి ఫైర్‌

హైదరాబాద్‌ అక్టోబర్‌ 28 అక్టోబర్ 28 (ఇయ్యాల తెలంగాణ ):జూబ్లీహిల్స్‌ మాజీ ఎమ్మెల్యే, దివంగత పీజేఆర్‌ కుమారుడు విష్ణువర్ధన్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీపై హాట్‌ కామెంట్స్‌ చేశారు. హాఫ్‌ టికెట్‌గాళ్లకు కూడా టికెట్లు ఇచ్చారంటూ ఫైర్‌ అయ్యారు. ప్రజలకు దండాలు పెట్టేవారికి కాకుండా నాయకులకు దండాలు పెట్టేవారికి మాత్రమే కాంగ్రెస్‌ పార్టీలో టికెట్లు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచే అవకాశం ఉన్న ఏకైక స్థానం జూబ్లీహిల్స్‌) అని.. అలాంటి సీటును నియోజకవర్గంతో సంబంధంలేనివారిక ఇచ్చారణి ఫైరయ్యారు. తనకే టికెట్‌ ఇస్తానని మాణిక్‌రావ్‌ థాక్రే కూడా చెప్పారని, తీరా జాబితాలో తన పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.తాను చాలా రోజులుగా ఇంటింటి ప్రచారం చేస్తున్నానని వెల్లడిరచారు. ఎస్సీ, బీసీ, సెటిలర్స్‌ ఓట్లు అత్యధికంగా ఉన్న జూబ్లీహిల్స్‌లో కేవలం ఒక కమ్యూనిటీ కోసం టికెట్‌ ఇవ్వడం దారణమన్నారు. ఒకే ఇంట్లో రెండు టికెట్స్‌ ఇవ్వమనే వాదన నిజమైతే.. దానికి విరుద్ధంగా ఎంతో మందికి ఇచ్చారని విమర్శించారు. హైదరాబాద్‌లో పీజేఆర్‌ లాంటి నాయకుడి కుటుంబానికి టికెట్‌ ఇస్తే తప్పేందని ప్రశ్నించారు. తాను కచ్చితంగా జూబ్లీహిల్స్‌ నుంచి పోటీచేస్తానని స్పష్టం చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....