హబ్సిగూడలో భారీ అగ్నిప్రమాదం

 
హైదరాబాద్‌ ఆగష్టు 2 (ఇయ్యాల తెలంగాణ):హబ్సిగూడలోని ఓ భవనంలో జరిగిన అగ్నిప్రమాదం స్థానికులను బెంబేలెత్తిస్తోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పినప్పటికీ ఇంకా దట్టంగా పొగలు వస్తుండటంతో భయాందోళనలకు గురవుతున్నారు.హబ్సిగూడలోని రెండో అంతస్తులోని ఓ హోటల్‌లో బుధవారం ఉదయం మంటలు చెలరేగాయి. ఈ మంటలు కాస్త మొదటి అంతస్తులోని అన్‌లిమిటెడ్‌ షోరూంలోకి కూడా వ్యాపించాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ముందుగా మూడు ఫైర్‌ ఇంజిన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ మంటలు అదుపులోకి రాలేదు. దీంతో 10 ఫైర్‌ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.అగ్ని ప్రమాదం జరిగిన భవనం పక్కనే పెట్రోలు బంక్‌ ఉండటంతో ముందు జాగ్రత్తగా పోలీసులు దాన్ని మూసేయించారు. అయితే మంటలు ఆర్పినప్పటికీ.. ఆ భవనంలో నుంచి దట్టంగా పొగలు వ్యాపిస్తున్నాయి. దీంతో ఉప్పల్‌ ? సికింద్రాబాద్‌ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిరది. అగ్నిప్రమాదం జరిగిన దుకాణాల నుంచి జీహెచ్‌ఎంసీ అద్దాలు తొలగిస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....