స్కూళ్ళలో ఇకపై తప్పనిసరిగా స్పోర్ట్స్‌ పీరియడ్‌ : Dy. CM భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, ఆగష్టు 27 (ఇయ్యాల తెలంగాణ) : ప్రభుత్వ  ప్రయివేటు విద్యా సంస్థల్లో తప్పనిసరిగా ఒక స్పోర్ట్స్‌ పీరియడ్‌ ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన ఉద్యోగుల క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం. ప్రపంచ స్థాయి క్రీడా పోటీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం పెరిగేలా స్పోర్ట్స్‌ యూని వర్సిటీని ఏర్పాటు చేస్తున్నా మన్నారు.హైదరాబాద్‌ లో ప్రసిద్ధ క్రీడా పోటీలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని నిర్వహణ కోసం అవకాశం ఇవ్వాలని ఇటీవలే కేంద్ర క్రీడాశాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశామన్నారు.క్రీడలకు నిధుల కొరత లేదని అవసరాలకు తగిన విధంగా నిధులు కేటాయిస్తా మన్నారు. క్రీడల ద్వారా వచ్చే స్ఫూర్తి జీవితానికి ఎంతో ఉపయోగపడుతుం దన్నారు.గత పాలకుల నుంచి వచ్చి న క్రీడా సముదాయాలను, ఆస్తులను మరమ్మతులు చేసి అభివృద్ధి చేయబో తున్నట్లు వెల్లడిరచారు. ఉప ముఖ్యమంత్రి మంత్రి బట్టి విక్రమార్క అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....