హైదరాబాద్ జూలై 12 (ఇయ్యాల తెలంగాణ ): తీగలగుట్టపల్లి ‘ఆర్వోబీ నిర్మాణంలో విూ వాటా ఎంత?’
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బీఆర్‌ఎస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ తీగలగుట్టపల్లి ‘ఆర్వోబీ నిర్మాణంలో విూ వాటా ఎంత?’ అని ప్రశ్నించారు. తమ ఘనతేనంటూ గొప్పలు చెబుతున్న బీఆర్‌ఎస్ నేతలు 8 ఏళ్లుగా ఎందుకు సాధించలేకపోయారని నిలదీశారు. కేంద్రం ఆమోదించి 8 నెలలైనా ఇంతవరకు ఎందుకు జాప్యం చేశారన్నారు. సొమ్ము కేంద్రానిదైతే… సోకు విూరు చేసుకోవడానికి సిగ్గనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఆర్వోబీ నిర్మాణ ఖర్చంతా కేంద్రమే భరించేలా ఒప్పించింది తానేనని అన్నారు.శంకుస్థాపనకు ఆహ్వానించకపోవడం రాష్ట్ర ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని బండి సంజయ్ అన్నారు. బీఆర్‌ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే వరంగల్`కరీంనగర్, ఎల్కతుర్తి`సిద్దిపేట, కరీంనగర్`జగిత్యాల రహదారి విస్తరణ పనులకు 8 ఏళ్లుగా నిధులెందుకు సాధించలేకపోయారని ప్రశ్నించారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం నిధులెందుకు తీసుకురాలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. కరీంనగర్ ప్రజలకు ఎవరెంటో అన్నీ తెలుసునని బండి సంజయ్ అన్నారు