సైలెన్సర్లనుRoad Roller తో తొక్కించిన పోలీసులు

నిర్మల్‌,సెప్టెంబర్ 05 (ఇయ్యాల తెలంగాణ) : నిర్మల్‌ జిల్లా కేంద్రంలో అధిక శబ్దంతో వెళ్తున్న వాహనాలపై పోలీసులు కొరడ దులిపించారు. ఇటీవల స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి బుల్లెట్‌ వాహనాల సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు… జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్‌ లో సుమారు 50 సైలెన్సర్లను రోడ్డు రోలర్‌ తో తొక్కించి నుజ్జు నుజ్జు చేశారు.ఈ సందర్భంగా డీఎస్పీ అల్లూరి గంగారెడ్డి మాట్లాడుతూ  బుల్లెట్‌ వాహనాలకు సైలెన్సర్‌ లను మార్పిడి చేయించి అధిక శబ్దంతో వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మోటారు వాహనాల సైలెన్సర్ల మార్పిడిపై అవగాహన కల్పించేందుకే ఈ చర్య చేపట్టినట్టు తెలిపారు. ఇందులో పట్టణ సీఐ పురుషోత్తం చారి, ట్రాఫిక్‌ ఎస్సై దేవేందర్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....