సైబర్‌ జాగృాక్త దివాస్‌

జగిత్యాల ఆగష్టు 3,(ఇయ్యాల తెలంగాణ ):ప్రతి నెల మొదటి బుధవారం  సైబర్‌ జాగృాక్త దివాస్‌ 

సైబర్‌ నేరాల,భద్రత పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్‌ఆన్నారు..సైబర్‌ నేరాలు పై అవగాహన గురించి ప్రతి నెల మొదటి బుధవారం రోజున సైబర్‌ జాగృాక్త  దివాస్‌ అనే ప్రత్యేక కార్యక్రమం జిల్లా లోని అన్ని పోలీస్‌ స్టేషన్లో పరిధిలో వివిధ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు, యువతకు, ప్రజలకు సైబర్‌ భద్రత , సైబర్‌ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఎస్పీ తెలిపారు..సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించి , సైబర్‌ నేరాలను నివారించడమే జిల్లా పోలీసుల లక్ష్యం అని జిల్లా ఎస్పీ అన్నారు. అందులో బాగంగా విద్యార్థులకు, యువతకు, ప్రజలకు సైబర్‌ క్రైంపై అవగాహన కల్పించడంలో భాగంగా తెలంగాణ పోలీస్‌ ఆధ్వర్యంలో సైబర్‌ జాగృాక్త  దివస్‌ అనే కార్యక్రమం ద్వారా సైబర్‌ భద్రత తో పాటు  సైబర్‌ నేరాలపై అవగాహన, నివారణకు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుత కాలంలో వాట్స్‌అప్‌, ఫేస్బుక్‌, ఇన్స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ విూడియా ను పిల్లలు ఎక్కువ వాడుతున్నారని, వాటిని వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తల్లిదండ్రులు పిల్లలకు సూచించాలని ఎస్పీ ఆన్నారు.ఈ కార్యక్రమంలో నేర్చుకున్న విషయాల్ని ప్రతి ఒక్కరు మిగతా వారికి అవగాహన కల్పించాల్సి ఉంటుందని అన్నారు . ఉపాధ్యాయులు సైతం సైబర్‌ నేరాల నియంత్రణలో తమవంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో  అందరికీ అవగాహన తప్పనిసరి ఎస్పీ అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....