సుప్రీంకోర్టును ఆశ్రయించిన KCR ..ఎందుకంటే.?

హైదరాబాద్‌, జులై 15 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యుత్‌ కమిషన్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విద్యుత్‌ కమిషన్‌ను రద్దు చేయాలని గతంలో కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌నుతెలంగాణ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. రేపు సీజేఐ చంద్రచూడ్‌ ధర్మాసనం ముందు కేసు విచారణ జరగనున్నది.

కాగా. తెలంగాణలో జరిగిన విద్యుత్తు ఒప్పందాలపై జస్టిస్‌ ఎల్‌. నరసింహారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్‌ నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిషన్‌ మాజీ సీఎం కేసీఆర్‌కు రెండోసార్లు నోటీసులు పంపించింది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్‌ పాత్రపై కమిషన్‌ వివరణ కోరింది. తనను విచారణకు పిలవకూడదంటూ కేసీఆర్‌ తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు. అయితే గులాబీ బాస్‌కు న్యాయస్థానంలో చుక్కెదురైంది. కేసీఆర్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....