సీజనల్‌ వ్యాధుల కట్టడికి పకడ్బందీ చర్యలు

  

పెద్దపల్లి జులై 3, (ఇయ్యాల తెలంగాణ ):జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌. సంగీత సత్యనారాయణ

 సీజనల్‌ వ్యాధుల కట్టడికి పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌. సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. సీజనల్‌ వ్యాధుల నివారణపై సోమవారం సవిూకృత జిల్లా కలెక్టరేట్‌ సమావేశమందిరం లో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌. సంగీత సత్యనారాయణ అదనపు కలెక్టర్లు వి. లక్ష్మీనారాయణ, కుమార్‌ దీపక్‌ లతో కలిసి సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ, వర్షాకాలం నేపథ్యంలో దోమలు అధికం కావడం వల్ల సీజనల్‌ వ్యాధులు విస్తరించే ప్రమాదం ఉన్నదని అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో దోమల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఆదివారం విద్యా సంస్థల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, జిల్లాలోని రెసిడెన్షియల్‌ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, కేజిబీవి లలో చదివే పిల్లల ఆరోగ్య పై ప్రతి రోజూ మానిటరింగ్‌ చేయాలని, ప్రతి రోజూ పిల్లల ఆరోగ్యంపై వార్డెన్‌ లు నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ సూచించారు. గత సంవత్సరం బేగంపేట, గద్దలపల్లి, గర్రెపల్లి, జూలపల్లి, ముత్తారం, రాఘవపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అధిక డెంగ్యూ కేసులు నమోదయ్యాయని, ఈ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని  సూచించారు.మండలాల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై సవిూక్షా సమావేశాలు నిర్వహించాలని, ముందస్తు గానే జాగ్రత్త వహించాలని, సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని  ఆదేశించారు. ప్రతి గ్రామంలో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని, గ్రావిూణ ప్రాంతాల్లో యువతకు, ప్రజలకు అవగాహన కల్పించాలని, గ్రామంలో ఏర్పాటు చేసిన పారిశుధ్య, ఆరోగ్య కమిటీలను భాగస్వామ్యం చేస్తూ విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్‌ సూచించారు. గ్రావిూణ ప్రాంతాల్లో నీటి లీకేజీలు కాకుండా చర్యలు తీసుకోవాలని, మిషన్‌ భగీరథ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, నీరు నిల్వ ఉండకుండా అవగాహన కల్పించాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. జిల్లాలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలను భాగస్వామ్యం చేస్తూ దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై  మహిళలకు, గ్రామస్తులకు విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు.  జిల్లాలోని మున్సిపాలిటీలో 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....